US Coast Guard Investigates : టైటానిక్ జలాంతర్గామి పేలుడుకు కారణాలపై యూఎస్ కోస్ట్‌గార్డ్ పరిశోధన

అట్లాంటిక్ మహా సముద్రంలో టైటానిక్ జలాంతర్గామి పేలుడుకు కారణాలపై యూఎస్ కోస్ట్ గార్డ్ శోధిస్తోంది.  శతాబ్దాల నాటి టైటానిక్ శిథిలాల వద్దకు డైవింగ్ చేస్తున్న సమయంలో జలాంతర్గామి పేలి ఐదుగురు వ్యక్తులు మరణించారు...

US Coast Guard Investigates : టైటానిక్ జలాంతర్గామి పేలుడుకు కారణాలపై యూఎస్ కోస్ట్‌గార్డ్ పరిశోధన

Titanic Submersible's Implosion

US Coast Guard Investigates : అట్లాంటిక్ మహా సముద్రంలో టైటానిక్ జలాంతర్గామి పేలుడుకు కారణాలపై యూఎస్ కోస్ట్ గార్డ్ శోధిస్తోంది.  శతాబ్దాల నాటి టైటానిక్ శిథిలాల వద్దకు డైవింగ్ చేస్తున్న సమయంలో జలాంతర్గామి పేలి ఐదుగురు వ్యక్తులు మరణించారు. టైటాన్ సబ్‌మెర్సిబుల్ సముద్రగర్భంలో పేలడానికి గల కారణాన్ని కనుగొనడానికి దర్యాప్తునకు నాయకత్వం వహిస్తున్నట్లు యూఎస్ కోస్ట్ గార్డ్ తెలిపింది.(Cause Of Titanic Submersible’s Implosion)

Kyriakos Mitsotaki wins as Greek PM : కైరియాకోస్ మిత్సోటా గ్రీక్ ప్రధానిగా రెండోసారి ఘన విజయం

ప్రపంచవ్యాప్తంగా సముద్ర భద్రతను పెంపొందించడానికి అవసరమైన సిఫార్సులు చేయడం ద్వారా ఇలాంటి సంఘటనలను నిరోధించడమే దర్యాప్తు యొక్క ప్రాథమిక లక్ష్యం అని యూఎస్ కోస్ట్ గార్డ్ అధికారులు తెలిపారు. ఉత్తర అట్లాంటిక్ జలాల్లో టైటానిక్ నుంచి 1,600 అడుగుల దూరంలో ఉన్న శిధిలాల క్షేత్రాన్ని కనుగొనడం కోసం శోధన, రెస్క్యూ ఆపరేషన్‌ను యూఎస్ ప్రారంభించింది.

PM Modi Returns To India : ముగిసిన యూఎస్,ఈజిప్టు పర్యటన, స్వదేశానికి తిరిగివచ్చిన మోదీ

పరిశోధన యొక్క ఫలితాలు ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ ప్రపంచవ్యాప్తంగా సబ్‌మెర్సిబుల్ కార్యకలాపాల కోసం భద్రతా ఫ్రేమ్‌వర్క్‌ను మెరుగుపర్చడంలో సహాయపడతాయని కోస్ట్ గార్డ్ చీఫ్ ఇన్వెస్టిగేటర్ కెప్టెన్ జాసన్ న్యూబౌర్ బోస్టన్‌లో విలేకరుల సమావేశంలో చెప్పారు.

Monsoon Warnings issued : రుతుపవనాల ప్రభావంతో పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు, వరదలు

కెనడా దేశ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ టైటాన్ పేలుడుపై సొంతంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపిన ఒక రోజు తర్వాత యూఎస్ నుంచి ఈ ప్రకటన వచ్చింది. ఇలాంటి సాహసయాత్రల యొక్క అనియంత్రిత స్వభావం గురించి ప్రశ్నలను లేవనెత్తింది. సబ్‌మెర్సిబుల్ పేలుడుపై దర్యాప్తు ప్రారంభించామని టైటాన్ మదర్ షిప్ పోలార్ ప్రిన్స్‌లో ప్రయాణించిన వారితో మాట్లాడుతున్నామని భద్రతా బోర్డు తెలిపింది.