Kyriakos Mitsotaki wins as Greek PM : కైరియాకోస్ మిత్సోటా గ్రీక్ ప్రధానిగా రెండోసారి ఘన విజయం

ఆదివారం జరిగిన ఎన్నికల్లో గ్రీక్ దేశ ప్రధానమంత్రిగా కన్జర్వేటివ్ నాయకుడు కైరియాకోస్ మిత్సోటాకిస్ రెండో సారి ఘన విజయం సాధించారు. గ్రీస్ దేశ జాతీయ ఎన్నికల్లో మిత్సోటాకిస్ కు చెందిన న్యూ డెమెక్రసీ పార్టీకి 40.5 శాతం ఓట్లు సాధించి విజయబావుటా ఎగురవేసింది....

Kyriakos Mitsotaki wins as Greek PM : కైరియాకోస్ మిత్సోటా గ్రీక్ ప్రధానిగా రెండోసారి ఘన విజయం

Kyriakos Mitsotaki wins as Greek PM

Kyriakos Mitsotaki wins as Greek PM : ఆదివారం జరిగిన ఎన్నికల్లో గ్రీక్ దేశ ప్రధానమంత్రిగా కన్జర్వేటివ్ నాయకుడు కైరియాకోస్ మిత్సోటాకిస్ రెండో సారి ఘన విజయం సాధించారు. గ్రీస్ దేశ జాతీయ ఎన్నికల్లో మిత్సోటాకిస్ కు చెందిన న్యూ డెమెక్రసీ పార్టీకి 40.5 శాతం ఓట్లు సాధించి విజయబావుటా ఎగురవేసింది. రెండవసారి అధికారంలోకి వచ్చిన మిత్సోటాకిస్( wins second term as Greek PM) దేశంలో ప్రధాన సంస్కరణలు తీసుకువస్తానని ప్రకటించారు.

PM Modi Returns To India : ముగిసిన యూఎస్,ఈజిప్టు పర్యటన, స్వదేశానికి తిరిగివచ్చిన మోదీ

మిత్సోటాకిస్‌ విజయంపై అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌ అభినందనలు తెలిపారు. ‘‘దేశ శ్రేయస్సు ,ప్రాంతీయ భద్రతను పెంపొందించడానికి భాగస్వామ్య ప్రాధాన్యతలపై మా సన్నిహిత సహకారాన్ని కొనసాగించడానికి నేను ఎదురుచూస్తున్నాను’’ అని జో బిడెన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కూడా మిత్సోటాకిస్ కు అభినందనలు తెలిపారు. ‘‘బలమైన సార్వభౌమమైన ఐరోపా కోసం చేపట్టిన అన్ని పనులను కలిసి కొనసాగిద్దాం’’ అని మాక్రాన్ ట్విట్టర్‌లో రాశారు.

Russia Revolt: ప్రిగోజిన్ ప్లాన్‌ను అమెరికా నిఘా సంస్థలు ముందుగానే పసిగట్టాయట.. పుతిన్‌కు ఎప్పుడు తెలిసిందంటే?

ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో తజానీ తన అభినందనలు తెలిపారు. మిత్సోటాకిస్ తిరిగి ఎన్నిక కావడం మొత్తం యూరప్‌కు మంచి రాజకీయ స్థిరత్వానికి సంకేతమని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.మిత్సోటాకిస్ 2019లో మొదటిసారిగా ప్రధానమంత్రి అయ్యారు. గ్రీకు దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి ముందుకు సాగాలనే ప్రతిజ్ఞపై తన పూర్వీకుడు సిప్రాస్‌ను ఓడించారు.