PM Modi Returns To India : ముగిసిన యూఎస్,ఈజిప్టు పర్యటన, స్వదేశానికి తిరిగివచ్చిన మోదీ

ఆరు రోజుల అమెరికా, ఈజిప్ట్‌ దేశాల పర్యటనల అనంతరం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం రాత్రి భారత్‌కు తిరిగి వచ్చారు. మోదీ విదేశీ పర్యటన సందర్భంగా పలు కీలక ఒప్పందాలపై సంతకాలు జరిగాయి....

PM Modi Returns To India : ముగిసిన యూఎస్,ఈజిప్టు పర్యటన, స్వదేశానికి తిరిగివచ్చిన మోదీ

స్వదేశానికి తిరిగి వచ్చిన ప్రధాని మోదీ

PM Modi Returns To India :ఆరు రోజుల అమెరికా, ఈజిప్ట్‌ దేశాల పర్యటనల అనంతరం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం రాత్రి భారత్‌కు తిరిగి వచ్చారు.(Landmark Visits To US, Egypt) మోదీ విదేశీ పర్యటన సందర్భంగా పలు కీలక ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. విదేశీ పర్యటన అనంతరం స్వదేశానికి ఆదివారం రాత్రి తిరిగివచ్చిన మోదీకి ఢిల్లీ విమానాశ్రయంలో కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనాకాశీ లేఖి, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా తదితరులు స్వాగతం పలికారు.

Narendra Modi: మోదీకి ఈజిప్ట్ అత్యున్నత పురస్కారం ప్రదానం.. ఈ ప్రాంతాలను సందర్శించిన భారత ప్రధాని

ఈ స్వాగత కార్యక్రమంలో ఢిల్లీకి చెందిన బీజేపీ నేతలు, పార్టీ ఎంపీలు హర్షవర్ధన్, హన్స్ రాజ్ హన్స్, గౌతమ్ గంభీర్ కూడా హాజరయ్యారు. వాషింగ్టన్ డీసీలో అధ్యక్షుడు బిడెన్ వైట్ హౌస్ వద్ద మోదీకి రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు. ఇద్దరు నేతల మధ్య గురువారం చారిత్రాత్మక శిఖరాగ్ర సమావేశం జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్‌ను ఉద్దేశించి మోదీ ప్రసంగం,అతని గౌరవార్థం బిడెన్స్ వైట్ హౌస్‌లో స్టేట్ డిన్నర్‌ను ఏర్పాటు చేశారు.

Egypt : ‘యే దోస్తీ హమ్ నహీ తోడేంగే’ పాట పాడి మోదీని ఆకట్టుకున్న ఈజిప్షియన్ మహిళ

రక్షణ, అంతరిక్షం, వాణిజ్యం వంటి కీలక రంగాలలో సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఈ పర్యటనలో పలు ప్రధాన ఒప్పందాలు చేసుకున్నారు. తన మొట్టమొదటి ఈజిప్టు పర్యటనను ముగించారు. ఈ పర్యటనలో మోదీ ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్-సిసితో చర్చలు జరిపారు. అరబ్ దేశం యొక్క అత్యున్నత గౌరవం ఆర్డర్ ఆఫ్ ది నైల్ ను ప్రధాని అందుకున్నారు.