Egypt : ‘యే దోస్తీ హమ్ నహీ తోడేంగే’ పాట పాడి మోదీని ఆకట్టుకున్న ఈజిప్షియన్ మహిళ

కైరోలో మోదీకి ఘన స్వాగతం లభించింది. ఇండియన్ కమ్యూనిటీకి చెందిన పెద్దలు, పిల్లలు మోదీ.. మోదీ అంటూ నినాదాలు చేశారు. ఈజిప్షియన్ మహిళ మోదీ ఎదురుగా షోలే సినిమాలోని 'యే దోస్తీ హమ్ నహీ తోడేంగే' పాట పాడి ఆకట్టుకుంది.

Egypt : ‘యే దోస్తీ హమ్ నహీ తోడేంగే’ పాట పాడి మోదీని ఆకట్టుకున్న ఈజిప్షియన్ మహిళ

Egypt

Updated On : June 25, 2023 / 11:07 AM IST

Egypt : రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత ప్రధాని మోదీ ఈజిప్టులో ఉన్నారు. ఈ సందర్భంలో కైరోలో ఈజిప్షియన్ మహిళ పాడిన బాలీవుడ్ సాంగ్ ప్రధాని మోదీని ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

Modi meets Egyptian Yoga instructors : ఈజిప్టులో మోదీని కలిసిన మహిళా యోగా శిక్షకులు..భారత్ సందర్శించాలని ప్రధాని ఆహ్వానం
శనివారం కైరో అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న మోదీకి ఈజిప్టు ప్రధాని మోస్తఫా మడ్‌బౌలీ స్వాగతం పలికారు. కైరోలోని హోటల్‌కు రాగానే ఇండియన్ కమ్యూనిటీ మోదీకి ఘన స్వాగతం పలికింది. బాలీవుడ్ సినిమా పాటల్లో సూపర్ హిట్ సాంగ్ అయిన ‘షోలే’ సినిమాలోని ‘యే దోస్తీ హమ్ నహీ తోడేంగే’ పాటని ఈజిప్టు మహిళ మోదీ ఎదురుగా పాడి ఆయన మన్ననలు పొందింది. ఈ పాట వినగానే మోదీ చప్పట్లు కొడుతూ కనిపించారు.

 

ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతూ అందరి మనసులు దోచుకుంది. ఇంతవరకూ తాను ఇండియా వెళ్లలేదని.. అయినా ఆరేళ్ల వయసు నుంచి ఇండియన్ సాంగ్స్ పాడుతున్నానని.. మోదీని కలవడం చాలా ఆనందంగా ఉందని ఈజిప్టు మహిళ మీడియాకి చెప్పడం విశేషం. మోదీ తనను భారతీయురాలిలా కనిపిస్తున్నానని చెప్పారని వెల్లడించింది.

PM Modi in Egypt : భారత్‌తో వాణిజ్య సంబంధాలపై ఈజిప్టు ప్రధాని,మంత్రులతో మోదీ చర్చలు

కైరోలోని రిట్జ్ కార్ల్‌టన్‌లో మోదీకి స్వాగతం చెప్పడానికి వచ్చిన ఇండియన్ కమ్యూనిటీ సభ్యులు గుమిగూడారు. ఇండియన్ ఫ్లాగ్ ఊపుతూ మోదీ.. మోదీ.. వందేమాతరం అంటూ నినాదాలు చేశారు. చిన్నారులు సైతం మోదీకి స్వాగతం పలికారు. ఈ సందర్భంలో ప్రవాస భారతీయుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి.