PM Modi in Egypt : భారత్‌తో వాణిజ్య సంబంధాలపై ఈజిప్టు ప్రధాని,మంత్రులతో మోదీ చర్చలు

ఈజిప్టు దేశ పర్యటనలో భాగంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈజిప్టు ప్రధాని మోస్తఫా మడ్ బౌలీతో కలిసి భారత్‌తో వాణిజ్య సంబంధాలపై చర్చించారు. ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్-సిసి ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఈజిప్ట్‌లో పర్యటిస్తున్నారు....

PM Modi in Egypt : భారత్‌తో వాణిజ్య సంబంధాలపై ఈజిప్టు ప్రధాని,మంత్రులతో మోదీ చర్చలు

Modi Meets Egyptian PM

Modi Meets Egyptian Prime Minister : ఈజిప్టు దేశ పర్యటనలో భాగంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈజిప్టు ప్రధాని మోస్తఫా మడ్ బౌలీతో కలిసి భారత్‌తో వాణిజ్య సంబంధాలపై చర్చించారు. ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్-సిసి ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఈజిప్ట్‌లో పర్యటిస్తున్నారు. 26 ఏళ్లలో భారత ప్రధాని ఈజిప్టులో పర్యటించడం ఇదే తొలిసారి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం ఈజిప్ట్‌లో తన తొలి పర్యటనను ప్రారంభించారు. రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడం, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై ఈజిప్టు ప్రధాని మోస్తఫా మడ్‌బౌలీ, క్యాబినెట్ అగ్ర మంత్రులతో చర్చించారు. (Discusses Trade Ties With India) ప్రధాన మంత్రి ఈజిప్టు గ్రాండ్ ముఫ్తీ డాక్టర్ షాకీ ఇబ్రహీం అబ్దెల్-కరీం అల్లంను కూడా కలిశారు.

Russia : మాస్కో మార్చ్ నిలిపివేత, వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్‌పై చర్యల ఉపసంహరణ

ఈజిప్టు దేశంలో భారతీయ ప్రవాస సభ్యులతో మోదీ సంభాషించారు. ప్రవాస భారతీయులు, బోహ్రా కమ్యూనిటీ సభ్యులను కూడా ఆయన కలిశారు. ఈజిప్టు ప్రధానితో సమావేశమైన ప్రధాని మోదీ, భారత్‌తో వాణిజ్య సంబంధాలపై చర్చించారు. అంతకుముందు ప్రధాని మోదీని ఇక్కడి విమానాశ్రయంలో ఈజిప్ట్ ప్రధాని సాదరంగా ఆలింగనం చేసుకొని లాంఛనప్రాయంగా గార్డ్ ఆఫ్ హానర్‌తో స్వాగతం పలికారు.

Mutiny in Russia: అప్పట్లో ఓ ఖైదీ.. ఇప్పుడు సొంత దేశ అధ్యక్షుడినే వణికిస్తున్న ప్రిగోజిన్.. ఇంత ధైర్యం ఎక్కడిది?

‘‘ఈ పర్యటన ఈజిప్టుతో భారతదేశ సంబంధాలను బలోపేతం చేస్తుందని నేను విశ్వసిస్తున్నాను. అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్-సిసితో చర్చలు, ఇతర కార్యక్రమాలకు హాజరయ్యేందుకు నేను ఎదురుచూస్తున్నాను’’ అని కైరోలో దిగిన తర్వాత ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఎల్-సీసీ భారత పర్యటన సందర్భంగా ఇద్దరు నేతలు బంధాన్ని వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచాలని నిర్ణయించుకున్నారు. మడ్‌బౌలీ నేతృత్వంలోని ఈజిప్టు మంత్రివర్గంలోని ఏడుగురు సభ్యులు మోదీతో సమావేశానికి హాజరయ్యారు. ప్రధాన మంత్రి మాడ్‌బౌలీ, ఆయన క్యాబినెట్ సహచరులు భారతదేశం యూనిట్ చేపడుతున్న కార్యకలాపాలను వివరించారు. కొత్త సహకార రంగాలను ప్రతిపాదించారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

Anthony Albanese : చాట్, జిలేబీ రుచి చూసిన ఆస్ట్రేలియా ప్రధాని.. మోదీ రికమండ్ చేశారంటూ ట్వీట్

వాణిజ్యం, పెట్టుబడులు, పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్, ఐటీ, డిజిటల్ చెల్లింపు ప్లాట్‌ఫారమ్‌లు, ఫార్మా,ప్రజల మధ్య సంబంధాల వంటి రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకునే మార్గాలపై చర్చలు జరిగినట్లు ప్రకటన పేర్కొంది. ఆదివారం ఈజిప్టు అధ్యక్షుడు ఎల్‌-సిసితో ప్రధాని మోదీ భేటీ కానున్నారు.అంతకుముందు, భారతీయ ప్రవాసులు సంప్రదాయ దుస్తులు ధరించి ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు ఇక్కడి రిట్జ్ కార్ల్టన్ హోటల్‌కు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇక్కడి హోటల్‌కు చేరుకున్న ప్రధానికి భారత త్రివర్ణ పతాకాన్ని ఊపుతూ భారతీయ సమాజం సభ్యులు మోదీ, మోదీ, వందేమాతరం నినాదాలతో స్వాగతం పలికారు. ఈజిప్టుకు చెందిన జెనా అనే మహిళ చీర కట్టుకుని షోలే సినిమాలోని పాపులర్ సాంగ్ యే దోస్తీ హమ్ నహీ తోడేంగే పాటతో ప్రధాని మోదీకి అభివాదం చేశారు.