Modi meets Egyptian Yoga instructors : ఈజిప్టులో మోదీని కలిసిన మహిళా యోగా శిక్షకులు..భారత్ సందర్శించాలని ప్రధాని ఆహ్వానం

ఈజిప్టు దేశ పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం నాడు ప్రముఖ యోగా మహిళా శిక్షకులతో భేటీ అయ్యారు. ఈజిప్టులో ప్రముఖ యోగా మహిళా శిక్షకులు రీమ్ జబక్, నాడా అడెల్‌లతో మోదీ సమావేశమయ్యారు. యోగా పట్ల వారికున్న అంకితభావాన్ని ప్రధాని మెచ్చుకున్నారు....

Modi meets Egyptian Yoga instructors : ఈజిప్టులో మోదీని కలిసిన మహిళా యోగా శిక్షకులు..భారత్ సందర్శించాలని ప్రధాని ఆహ్వానం

PM Modi meets Egyptian Yoga instructors

PM Modi meets Egyptian Yoga instructors : ఈజిప్టు దేశ పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం నాడు ప్రముఖ యోగా మహిళా శిక్షకులతో భేటీ అయ్యారు. ఈజిప్టులో ప్రముఖ యోగా మహిళా శిక్షకులు రీమ్ జబక్, నాడా అడెల్‌లతో మోదీ సమావేశమయ్యారు. యోగా పట్ల వారికున్న అంకితభావాన్ని ప్రధాని మెచ్చుకున్నారు.

Hong Kong Flight : పేలిన హాంకాంగ్ విమానం టైరు..11 మంది ప్రయాణికులకు గాయాలు

‘‘ఈజిప్ట్‌కు చెందిన ప్రముఖ యోగా అభ్యాసకులు ,బోధకులు రీమ్ జబక్, నాడా అడెల్ కైరోలో ప్రధాని మోదీని కలిశారు. యోగాను ప్రాచుర్యంలోకి తీసుకురావడంలో వారి అంకితభావానికి ప్రధాని ప్రశంసించారు’’ అని ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. ఈజిప్టులో యోగా పట్ల ఉన్న ఉత్సాహం గురించి ఇద్దరు శిక్షకులు ప్రధాని మోదీకి తెలియజేసినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు.

Minister Amit shah: అమిత్ షాతో మంత్రి కేటీఆర్ భేటీ రద్దు.. కారణమేమంటే?

యోగా శిక్షకురాలు రీమ్ జబక్ ప్రధాని మోదీని కలిసి యోగాలో తన అనుభవాన్ని పంచుకున్నారు. మోదీ బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ ఈజిప్ట్ దేశంలో యోగా ప్రాముఖ్యతను ప్రస్థావించడానికి సమయం ఇవ్వడం మాకు సంతోషాన్నిచ్చిందని రీమ్ జబక్ చెప్పారు. ఈజిప్టులోని యోగా కమ్యూనిటీ గురించి తెలుసుకోవాలనే ప్రధాని మోదీ ఆత్రుత తనను ఎంతగానో ఆకట్టుకుందని యోగా శిక్షకురాలు తెలిపారు. ప్రపంచంలోని అన్ని మతాలు శాంతి నుంచి వచ్చాయని యోగా తనకు నేర్పిందని ఆమె చెప్పారు. ఈజిప్టులోని ప్రముఖ యోగా శిక్షకులను భారతదేశాన్ని సందర్శించాలని మోదీ ఆహ్వానించారు.

Alia Bhatt : మొదటి సినిమా కాబట్టి.. ప్రెగ్నెన్సీ ఉన్నా షూట్ కి వెళ్ళాను..

ప్రధాని మోదీ యోగా పట్ల తన ఉత్సాహాన్ని పదే పదే చూపిస్తున్నారు. ఇటీవల ఆయన ఐరాస ప్రధాన కార్యాలయంలో జరిగిన 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు హాజరయ్యారు. ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో అత్యధిక దేశాల ప్రజలు పాల్గొన్నందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో కూడా చేరారు.