Monsoon Warnings issued : రుతుపవనాల ప్రభావంతో పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు, వరదలు

దేశంలో రుతుపవనాల ప్రభావంతో పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, చత్తీస్ ఘడ్, ఒడిశా, ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమబెంగాల్, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, తెలంగాణ రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి....

Monsoon Warnings issued : రుతుపవనాల ప్రభావంతో పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు, వరదలు

Flash floods in Himachal

Monsoon Warnings issued : దేశంలో రుతుపవనాల ప్రభావంతో పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, చత్తీస్ ఘడ్, ఒడిశా, ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమబెంగాల్, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి. గుజరాత్, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, పంజాబ్, ఢిల్లీ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీవర్షాలు వరదలు వెల్లువెత్తాయి.(Orange alert in Delhi) పలు లోతట్టుప్రాంతాలు జలమయం అయ్యాయి.

ఐఎండీ అలర్ట్ జారీ 

భారీవర్షాలు, వరదల నేపథ్యంలో భారత వాతావరణశాఖ అధికారులు అలర్ట్ ప్రకటించారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కురుస్తున్న భారీవర్షాలతో కొండచరియలు విరిగిపడే ప్రమాదముందని ఐఎండీ హెచ్చరించింది. నైనిటాల్, చంపావత్, పితోరాఘడ్, బాగేశ్వర్, డెహ్రాడూన్, తెహ్రీ, పౌరి జిల్లాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఐఎండీ ఆరంజ్ అలర్ట్ జారీ చేసింది. హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లోని అంబాలా, కర్నాల్, నార్నాల్, రోహతక్, భీవానీ, గురుగ్రామ్,కురుక్షేత్ర, మొహాలి ప్రాంతాల్లో రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

వరదలతో విరిగిపడుతున్న కొండచరియలు

పంచకులలో కారు నది వరదనీటిలో(Flash floods) కొట్టుకుపోగా ఓ మహిళను స్థానికులు కాపాడారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో వరదల వల్ల రోడ్లు, వాహనాలు దెబ్బతిన్నాయి.(Flash floods in Himachal) పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో పలు రోడ్లపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కంగ్రా, మండీ, సోలన్ జిల్లాల్లో వరదలు వెల్లువెత్తాయి. సోమవారం నుంచి మూడు రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్ లో అతి భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు ఆరంజ్ అలర్ట్ జారీ చేశారు.

ముంబయిలోనూ అతి భారీవర్షాలు

మహారాష్ట్రలోని ముంబయి నగరంలోనూ అతి భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు చెప్పారు. ఆదివారం కురిసిన భారీవర్షాల వల్ల ముంబయిలోని మలాద్,అంధేరి ప్రాంతాల్లో వరదనీరు నిలిచింది. వరదల నేపథ్యంలో మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను అప్రమత్తం చేశారు. ఢిల్లీ, ముంబయి నగరాల్లో రాగల 48 గంటల్లో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. నగరాల్లో ఆరంజ్ అలర్ట్ జారీ చేశారు.

అసోంలోనూ వరదలు

అసోం రాష్ట్రంలోనూ భారీవర్షాల వల్ల 14 జిల్లాల్లో వరదలు వచ్చాయి. వరదప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దారంగ్, నల్బరీ జిల్లాల్లో భారీవర్షాలు, వరదల వల్ల భారీ ఆస్తి నష్టం వాటిల్లింది. రుతుపవనాల భారీ వర్షాల వల్ల పూంచ్, మెందాల్ జిల్లాల్లో వరదలు సంభవించాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనూ భారీవర్షాల వల్ల వరదలు వచ్చాయి. చత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ నెల 29వతేదీ వరకు భారీవర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు చెప్పారు.