Nitin Robin Hood movie : నితిన్ రాబిన్ హుడ్ మూవీ విడుదల వాయిదా.. ఆ సినిమాల వల్లేనా..
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నారు. అందులో రాబిన్ హుడ్ ఒకటి మరొకటి తమ్ముడు.

The release of Nitin Robin Hood movie is postponed
Nitin Robin Hood movie : టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నారు. అందులో రాబిన్ హుడ్ ఒకటి మరొకటి తమ్ముడు. ఇక వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాబిన్ హుడ్ సినిమాలో టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి వరుస అప్డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. ఇటీవల ఫస్ట్ సింగిల్ కూడా రిలీజ్ చేశారు.
Also Read :Manchu Manoj – Nirmala Devi : మంచు మనోజ్ దే తప్పు అంటూ లెటర్ విడుదల చేసిన మోహన్ బాబు భార్య..
అయితే ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న విడుదల చేస్తామని ఇప్పటికే అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ ను వాయిదా వేసినట్టు తెలిపారు మేకర్స్. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని తెలిపారు. అయితే ఈ సినిమా క్రిస్మస్ బరిలో నుండి తప్పుకోవడానికి పెద్ద సినిమాలే కారణమని తెలుస్తుంది. ఈ సినిమా రిలీజ్ రోజే అల్లరి నరేష్ నటిస్తున్న బచ్చల మల్లి సినిమా ఉంది. అలాగే ఉపేంద్ర నటిస్తున్న UI సినిమా కూడా ఉంది. ఈ సినిమాల తర్వాత బేబీ జాన్, వెన్నెల కిషోర్ నటిస్తున్న శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్, అలాగే మహేష్ బాబు వాయిస్ అందించిన ముఫాసా సినిమాలు ఉన్నాయి. అందుకే ఈ సినిమా రిలీజ్ వాయిదా వేసినట్టు తెలుస్తుంది.
అంతేకాదు.. రాబిన్ హుడ్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తికాలేదట. అలా ఈ సినిమా రిలీజ్ డేట్ వాయిదా వేసినట్టు తెలుస్తుంది. క్రిస్మస్ బరిలో నుండి తప్పుకున్న ఈ సినిమా సంక్రాంతికి కూడా వచ్చే అవకాశాలు లేవు. ఎందుకంటే అప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా ఉంది. అందుకే పెద్ద సినిమాలన్నీ అయిపోయిన తర్వాత ఈ సినిమాను సింగిల్ గా రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. అన్ని కుదిరితే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తునప్పటికీ దీనికి సంబందించిన అధికారిక ప్రకటన మాత్రం లేదు.