Big Boss 5
Big Boss 5: చూస్తుండగానే బిగ్ బాస్ ఇంట్లో 19 మంది కంటెస్టెంట్లు వారం రోజులు గడిపేశారు. తొలి రోజు నుండే కంటెస్టెంట్ల మధ్య చిచ్చు పెట్టడం మొదలు పెట్టిన బిగ్ బాస్ ఈసారి మరో అడుగు ముందుకేశాడు. ఈవారం ఇంటి సభ్యులలో బెస్ట్, వరస్ట్ పర్ఫామర్‌లను ఎన్నుకోవాలని కంటెస్టెంట్లను ఆదేశించాడు. ఇక సభ్యుల మధ్య చిచ్చు పెట్టింది. ఎవరికి వారు నచ్చిన వాళ్ళకి బెస్ట్ అని ఓటేస్తే.. నచ్చని వాళ్ళని వరెస్ట్ అనేశారు. ఇది జీర్ణించుకోలేని కొందరు తనను వరెస్ట్ అన్న వాళ్ళపై వివాదానికి దిగగా.. కొందరు వరెస్ట్ అని చెప్పడంలోనే వివాదాన్ని సృష్టించారు.
Naina Ganguly: నైనా.. అసలేంటీ రెచ్చగొట్టడం!
ముందుగా లోబో బెస్ట్ పర్ఫామర్ అని ఓటేసిన యాంకర్ రవి జెస్సీ వరస్ట్ పర్ఫామర్ అని పేర్కొన్నాడు. లోబో.. యానీ మాస్టర్ బెస్ట్ అని.. జెస్సీ వరస్ట్ అని, శ్వేత వర్మ.. విశ్వ బెస్ట్, ఉమాదేవి వరస్ట్ అని చెప్పింది. సిరి.. నటరాజ్ మాస్టర్ బెస్ట్, ఉమాదేవి వరస్ట్ అని, విశ్వ.. ప్రియాంక సింగ్ బెస్ట్ అని.. కాజల్‌ను వరస్ట్ గా, లహరి.. విశ్వ బెస్ట్ అని, కాజల్ వరస్ట్ అని చెప్పుకొచ్చింది. ప్రియాంక సింగ్.. లోబో బెస్ట్ ఉమాదేవి వరస్ట్ అని అభిప్రాయపడింది. ఇక వరెస్ట్ అని ఎక్కువగా ఓట్లు పడిన జెస్సీ.. సిరిని బెస్ట్, రవిని వరస్ట్ అనగా, ఉమాదేవి.. విశ్వ బెస్ట్‌గా, కాజల్ వరస్ట్‌గా తేల్చేసింది.
MAA Elections: కొత్త ట్విస్ట్.. ‘మా’ ఎన్నికల బరిలో బాబుమోహన్?
ఈ ఓటింగ్ క్రమంలోనే ప్రియాంకా ఉమాను వరెస్ట్ అని చెప్పడంతో ఆమె మాటలతో ఏకీభవించని ఉమా.. నీతో మాట్లాడటమే వేస్ట్ అనేసింది. అలా అలా మాటలు పెరిగి ఇద్దరి మధ్య పెద్ద గొడవే రాజుకుంది. ఒకరి మీదకు ఒకరు దూసుకు వెళ్లడమే కాక ప్రియాంకా ఉమాను షటప్ అంటూ వేలు చూపించడంతో ఉమా ఏయ్ అంటూ మీదకి వెళ్ళింది. లోబో, రవి ఇద్దరికే నచ్చజెప్పే ప్రయత్నం చేయగా ప్రియాంకా కాసేపటికి ఆవేశంలో షటప్ అనేశానని.. ఉమాకి సారీ చెప్పడంతో కొంత కూల్ అయింది.