‘రూలర్’ – బాలయ్య అస్సలు తగ్గట్లేదుగా!
నటసింహ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న‘రూలర్’ సినిమాలోని అల్ట్రా స్టైలిష్ లుక్ రిలీజ్.. త్వరలో టీజర్ విడుదల కానుంది..

నటసింహ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న‘రూలర్’ సినిమాలోని అల్ట్రా స్టైలిష్ లుక్ రిలీజ్.. త్వరలో టీజర్ విడుదల కానుంది..
నటసింహ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న‘రూలర్’ నుండి మరో కొత్త పోస్టర్ రిలీజ్ అయ్యింది. ‘జైసింహా’ తర్వాత బాలయ్య, కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య రెండు ఢిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్స్‌కి చక్కటి స్పందన వచ్చింది.
రీసెంట్‌గా బాలయ్య గోల్ఫ్ స్టిక్ పట్టుకుని ఉన్న స్టిల్ విడుదల చేశారు. అల్ట్రా స్టైలిష్ లుక్‌లో బాలయ్యను చూసి.. ‘కోకోకోలా పెప్సీ.. బాలయ్య బాబు సెక్సీ’ అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఈ లుక్ తెగ షేర్ చేస్తున్నారు. బాలయ్య మేకోవర్, కాస్ట్యూమ్స్ అదిరిపోయాయి.. కుర్ర హీరోలకు ఏ మాత్రం తీసిపోని యంగ్ లుక్ బాలయ్య అభిమానులను ఆకట్టుకుంటోంది.
Read Also : ‘తోలుబొమ్మలాట’ సెన్సార్ పూర్తి – నవంబర్ 22 విడుదల
తర్వలో టీజర్ విడుదల చేయనున్నారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ‘రూలర్’ రిలీజ్ కానుంది. సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్ కాగా ప్రకాశ్రాజ్, జయసుధ, భూమిక చావ్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.