Taapsee Pannu : హీరోలని డామినేట్ చెయ్యకుండా ఉండే హీరోయిన్లనే తీసుకుంటారు.. తాప్సి షాకింగ్ కామెంట్స్

They take heroines who dont dominate the heroes Taapsee shocking comments
Taapsee Pannu : నటి తాప్సి కేవలం టాలీవుడ్ లో వరుస సినిమాలు చేసి ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉన్నారు. షారుక్ ఖాన్ హీరోగా రాజ్‌కుమార్ హిరాణీ తెరకెక్కించిన ‘డంకీ’ సినిమాలో నటించింది తాప్సి. అయితే తాజాగా ఈ సినిమాలో నటించినందుకు ఎక్కువ పారితోషికం తీసుకోలేదని తెలిపింది.
అయితే తాజాగా తాప్సి ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. ఎప్పటినుండో ఇండస్ట్రీలో ఉన్నాను. ఎప్పుడూ డిఫరెంట్ సినిమాలతో ఆడియన్స్ ను ఆకట్టుకోవాలని కోరుకుంటా, కానీ రెమ్యూనరేషన్ విషయంలో అందరికీ ఒకేలా ఉండదు. ‘జుడ్వా 2’, ‘డంకీ’ ప్రాజెక్టుల్లో నటించినందుకు పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ అందుకున్నానని చాలా మంది అనుకుంటున్నారు. అందులో అసలు నిజం లేదు. సినీ పరిశ్రమలో హీరోయిన్స్‌ని ఒక్కొక్కరూ ఒక్కో విధంగా చూస్తారు.
Also Read : Samantha : ఐటమ్ సాంగ్స్ చెయ్యను.. సింగిల్‌గా కూడా ఉండను.. సమంత సంచలన వ్యాఖ్యలు..
అంతేకాదు తమ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు నటించాలనే విషయాన్ని చాలా సందర్భాల్లో హీరోనే నిర్ణయిస్తారు, హీరోస్ ను డామినేట్ చేసే విధంగా హీరోయిన్స్ ఉండకూదని, హీరోలని డామినేట్ చెయ్యకుండా తమకి అనుకూలంగా ఉండే హీరోయిన్స్ నే తీసుకంటారని చెప్పింది తాప్సి. మా సినిమాలో పెద్ద హీరో నటించారు. ఇంత పెద్ద హీరో ఉన్నప్పుడు వేరే వాళ్ళతో పనేముందని అనుకుంటారు. ఇంకొందరు మేము మంచి ప్రాజెక్టులు ఇచ్చి మీ కెరీర్‌కు సాయం చేస్తున్నాం రెమ్యూనరేషన్ ఏముంది అన్నట్లు మాట్లాడతారు. ఇలాంటి మాటలపై ప్రతిరోజూ పోరాటం చేస్తున్నా’’ అని ఓ ఇంటర్వ్యూలో తాప్సీ తెలిపారు.