Papam Prathap OTT: ఓటీటీలోకి ఇంట్రెసింగ్ మూవీ ‘పాపం ప్రతాప్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో తిరువీర్, పాయల్ రాధాకృష్ణ లీడ్ రోల్స్‌లో నటించిన లేటెస్ట్ మూవీ 'పాపం ప్రతాప్(Papam Prathap OTT)' ఓటీటీ రిలీజ్ కి సిద్ధం అయ్యింది.
thiruveer papam prathap movie ott release date update
- తిరువీర్ పాపం ప్రతాప్ ఓటీటీ రిలీజ్.
- మే 7 నుండి ఈటీవీ విన్.
- ఆలుమగల మధ్య కామెడీ డ్రామా కథ.
Papam Prathap OTT: టాలీవుడ్ టాలెంటెడ్ హీరో తిరువీర్, పాయల్ రాధాకృష్ణ లీడ్ రోల్స్‌లో నటించిన లేటెస్ట్ మూవీ ‘పాపం ప్రతాప్’. ఇటీవలే థియేటర్స్ లో అలరించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధం అయ్యింది. థియేటర్లలో సక్సెస్ఫుల్ వినోదాన్ని పంచిన ఈ సినిమా, మే 7 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఈటీవీ విన్’ (ETV Win) వేదికగా స్ట్రీమింగ్(Papam Prathap OTT) కానుంది. ఎస్పీ దుర్గా నరేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం భార్యాభర్తల మధ్య సాగే ఒక ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అండ్ ఫ్యామిలీ డ్రామాగా ప్రేక్షకులను ఆకట్టుకోనుంది.
The Odyssey Trailer: ‘ది ఒడిస్సీ’ ట్రైలర్ రిలీజ్.. నోలన్ మార్క్ విజువల్స్ నెక్స్ట్ లెవల్
ఇక పాపం ప్రతాప్ సినిమా కథ విషయానికొస్తే, ప్రతాప్ (తిరువీర్) తన చిన్ననాటి ప్రేమ అయిన బుజ్జమ్మ (పాయల్)ను ఎన్నో కష్టాల తర్వాత పెళ్లి చేసుకుంటాడు. అయితే, పెళ్లయిన మూడు రోజులకే వీరి మధ్య రచ్చ మొదలవుతుంది. ప్రతాప్లో ఏదో లోపం ఉందని బుజ్జమ్మ పుట్టింటికి వెళ్లిపోతుంది. ఆ సమస్య ఏంటో ఎవరికీ చెప్పకుండా, ప్రతాప్ స్వయంగా తెలుసుకుని సరిదిద్దుకుంటేనే కాపురానికి వస్తానని కండిషన్ పెడుతుంది. తనలోని ఆ సీక్రెట్ సమస్యను కనిపెట్టేందుకు ప్రతాప్ పడే పాట్లు నవ్వులు పూయిస్తాయి.
ఈ క్రమంలో ప్రతాప్ తన సమస్యను ఎలా గుర్తించాడు? బుజ్జమ్మ పెట్టిన కండిషన్‌ను ఎలా ఫుల్‌ఫిల్ చేశాడు? చివరికి ఈ జంట మళ్లీ ఎలా కలిశారు? అనేది సినిమా సారాంశం. వినూత్నమైన కథాంశంతో, సహజ సిద్ధమైన కామెడీతో సాగే ఈ చిత్రాన్ని ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయవచ్చు. తిరువీర్ తన మార్క్ యాక్టింగ్‌తో ప్రతాప్ పాత్రలో ఒదిగిపోగా, మిగిలిన నటీనటులు తమ పెర్ఫార్మెన్స్తో సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లారు. ఈ మే 7న వినోదాన్ని ఆస్వాదించేందుకు సిద్ధంగా ఉండండి.
