కరోనా కంటే కులం ప్రమాదకరం.. రామ్ సంచలన ట్వీట్..

  • Published By: sekhar ,Published On : August 17, 2020 / 04:49 PM IST
కరోనా కంటే కులం ప్రమాదకరం.. రామ్ సంచలన ట్వీట్..

Updated On : August 17, 2020 / 6:59 PM IST

హీరో రామ్ పోతినేని విజయవాడ స్వర్ణ ప్యాలెస్ ఘటనపై కొద్ది రోజులుగా చేస్తున్న ట్వీట్స్ సంచలనంగా మారాయి. హోటల్ స్వర్ణ ప్యాలెస్‌ని రమేష్ హాస్పిటల్స్ వాళ్లు కోవిడ్ సెంటర్‌గా మార్చక ముందు, ప్రభుత్వం అక్కడ క్వారంటైన్ సెంటర్ నిర్వహించింది. అప్పుడీ అగ్ని ప్రమాదం జరిగి ఉంటే ఎవరిని నిందించే వాళ్లు?
పెద్ద కుట్ర జ‌రుగుతున్న‌ట్టుంది.. సీఎంని త‌ప్పుగా చూపించ‌డానికి ఆయన కింద ప‌ని‌చేసే కొంత‌మంది చేస్తున్న పనులవల్ల సీఎంకి చెడ్డ పేరు వస్తోందంటూ వరుసగా ట్వీట్లు వేసిన రామ్ తాజాగా క్యాస్ట్ గురించి చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.



‘‘నా ప్రియమైన బ్రదర్స్ మరియు సిస్టర్స్‌కు.. కులం అని పిలవబడే వ్యాధి కరోనా కంటే వేగంగా వ్యాపిస్తుంది మరియు త్వరగా అంటుకుంటుంది. ఇది కరోనా కంటే ప్రమాదకరమైనది. దీనిని నిశ్శబ్దంగా వ్యాపింపజేసేవాళ్లు.. మిమ్మల్ని కూడా అందులోకి లాగడానికి ప్రయత్నిస్తారు. దయచేసి దూరంగా ఉండండి. గొప్పదైన పని కోసం అందరూ కలిసి ఉండండి. ప్రేమతో రామ్ పోతినేని..’’ అని రామ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.