“నా తొమ్మిది నెలల బిడ్డతో డార్లింగ్” అంటూ.. ప్రభాస్ ఫోటో షేర్ చేసిన ఛార్మీ!

  • Published By: vamsi ,Published On : November 11, 2020 / 09:45 AM IST
“నా తొమ్మిది నెలల బిడ్డతో డార్లింగ్” అంటూ.. ప్రభాస్ ఫోటో షేర్ చేసిన ఛార్మీ!

Updated On : November 11, 2020 / 11:03 AM IST

Prabhas:ఒకప్పటి స్టార్ హీరోయిన్, ప్రొడ్యూసర్ ఛార్మీకౌర్ ప్రస్తుతం పూరీ కనెక్ట్స్‌ పేరుతో సినిమాలు తీస్తూ బిజీగా గడుపుతుంది. లేటెస్ట్‌గా ఇన్‌స్టాగ్రమ్‌లో తన బేబీబాయ్‌తో ప్రభాస్ అంటూ ఓ ఫోటోను సోషల్ మీడియాలో పెట్టింది ఈ అమ్మడు. ఇప్పుడు ఈ ఫోటో వైరల్ అయ్యింది.

హీరోయిన్‌ ఛార్మీకి పెళ్లి అవ్వలేదు కదా? బేబీ బాయ్ ఏంటీ? 9నెలల కొడుకు అనగానే కాస్త ఆసక్తిగా చూడవచ్చు. అయితే అసలు విషయం ఏంటి అంటే, ఛార్మీ కౌర్ పెంచుకునే కుక్కనే తన బేబీ బాయ్‌గా వ్యవహరించింది.



ఛార్మీకౌర్ అల‌స్క‌న్ మాలామ్యూట్ జాతి కుక్కను పెంచుకుంటూ ఉండగా.. ఆ కుక్కతోనే సోఫాలో కూర్చుని ఫోటో దిగారు ప్రభాస్. ఛార్మీ షేర్‌ చేసిన ఈ ఫొటోలో నవ్వుతూ కుక్కతో ఉన్నాడు. ప్రభాస్‌ని చూసిన ఫ్యాన్స్‌ పండగ చేసుకుంటున్నారు. చాలా రోజుల తర్వాత ప్రభాస్‌ ఫొటో దర్శనం ఇవ్వడంతో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

 

View this post on Instagram

 

#Darling with my 9 months old baby boy ♥️ . . . @actorprabhas #alaskanmalamute @puriconnects

A post shared by Charmmekaur (@charmmekaur) on

అయితే ఫోటోలో కుక్కనా? లేదా సింహమా? అనే డౌట్ వస్తుంది అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. పెట్ వెనకాల ఉన్నది మాత్రం నిజమైన సింహమని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే పూరి జగన్నాథ్‌తో ప్రభాస్ సినిమా చేయబోతోన్నాడా? అందుకే కలిశాడా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. గతంలో ఛార్మీతో ప్రభాస్.. పౌర్ణమి, చక్రం సినిమాల్లో కలిసి నటించారు.