కత్రీనా కైఫ్ వివాహం..తల్లిదండ్రులుగా బిగ్ బీ, జయా బచ్చన్
బాలీవుడ్ తన డ్యాన్స్, అందచందాలతో ఊపేస్తున్న హీరోయిన్లలో కత్రినా ఒకరు. ఈమె వివాహం సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. తల్లిదండ్రులుగా బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్లు వ్యవహరించారు. ఏంటీ కత్రినాకు వివాహం ఎప్పుడు జరిగింది ? ఎక్కడ జరిగింది ? అని నోరెళ్ల బెడుతున్నారా ? మీరనుకున్నట్లు అలాంటిదేమీ జరిగిలేదు.
ఉత్తుత్తి వివాహం. నిజమైన వివాహం కాదు. ఓ షూటింగ్లో మాత్రమే. ఓ నగల కంపెనీకి కత్రినా బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే కదా. అందులో భాగంగా నగల అభరణాల కోసం ఓ కొత్త యాడ్ షూటింగ్ నిర్వహించారు.
దీనికి సంబంధించిన ఫొటోలను అమితాబ్ బచ్చన్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. క్షణాల్లో ఫొటోలు వైరల్‌గా మారిపోయాయి. నగల దుకాణం కొత్త యాడ్‌ను చిత్రీకరిస్తున్నారు. ఇందులో కత్రినా కైఫ్‌కు వివాహం చేస్తున్నట్లు, కత్రినా తల్లిదండ్రులుగా అమితాబ్, బయా బచ్చన్లు పాల్గొనగా షూటింగ్ చిత్రీకరించారు. ముఖ్యఅతిథులుగా టాలీవుడ్ మన్మథుడు నాగార్జున, ప్రభు, రాజ్ కుమార్‌లు ఉన్నారు.
Read More : మహేష్ నన్ను ఆప్యాయంగా మావయ్యా అని పిలిచేవాడు – దర్శకేంద్రులు కె.రాఘవేంద్రరావు
పలు చిత్ర పరిశ్రమలకు చెందిన ఒకప్పటి హీరోల కుమారులతో కలిసి నటించడం తనకు ఎంతో సంతోషంగా ఉందని అమితాబ్ ట్వీట్లో వెల్లడించారు. యాడ్ కోసం పనిచేయడం తనకు, జయాకు చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు బిగ్ బి.
* టాలీవుడ్ ఒకప్పటి హీరో అక్కినేని నాగేశ్వరరావు రావు కుమారుడు నాగార్జున.
* కన్నడ పరిశ్రమకు చెందిన డాక్టర్ రాజ్ కుమార్ కొడుకు శివరాజ్ కుమార్.
* తమిళ పరిశ్రమకు చెందిన శివాజీ గణేషన్ కొడుకు ప్రభు.