Ticket Eh Konakunda Lyrical Song released from Tillu Square
Tillu Square : సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ ‘టిల్లు స్క్వేర్’. గత ఏడాది వచ్చిన డీజే టిల్లు (DJ Tillu) బ్లాక్ బస్టర్ హిట్టు అవ్వడంతో ఈ మూవీ పై మంచి అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీ.. ప్రమోషన్స్ ని మొదలు పెట్టింది చిత్ర యూనిట్. ఈ క్రమంలోనే ఈ మూవీ నుంచి మొదటి సాంగ్ ని రిలీజ్ చేశారు మేకర్స్.
Guntur Kaaram : గుంటూరు కారం మూవీకి మొదటి హీరో మహేష్ కాదట.. ఎన్టీఆర్ అంటా.. నిజమెంత..!
‘టికెటే కొనకుండా’ అని సాగే సాంగ్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. రామ్ మిర్యాల సంగీతం అందించిన ఈ పాటని తానే పాడాడు. కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా జానీ మాస్టర్ ఈ సాంగ్ కి డాన్స్ కోరియోగ్రఫీ చేశాడు. ఇక ఈ సాంగ్ లో అనుపమ అండ్ సిద్దు మధ్య కెమిస్ట్రీ చూస్తుంటే.. మూవీ ఓ రేంజ్ లో ఉండబోతుందని తెలుస్తుంది. కాగా ఈ మూవీ మొదటి పార్ట్ కి కొనసాగింపు గానే రాబోతుంది. టిల్లు 1ని విమల్ కృష్ణ తెరకెక్కిస్తే.. ఈ సీక్వెల్ ని మల్లిక్ రామ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఫస్ట్ పార్ట్ కి కథని అందించిన హీరో సిద్ధునే ఈ మూవీ కూడా కథ, మాటలు రాస్తున్నాడు.
Bholaa Shankar : మెగాస్టార్ మూవీ ట్రైలర్ రిలీజ్ చేయనున్న మెగాపవర్ స్టార్.. టైం తెలుసా..?
సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంస్థలు ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సెప్టెంబర్ 15న రిలీజ్ ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు. టిల్లు 1 ని రొమాంటిక్ క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ గా ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చి ఎంటర్టైన్ చేసిన మేకర్స్.. ఈ సీక్వెల్ లో ఏ జోనర్ తో అలరించబోతున్నారో చూడాలి.