Ramarao On Duty
Ramarao on Duty : గత కొన్ని రోజులుగా సినీ పరిశ్రమని వేధిస్తున్న సమస్య టికెట్ రేట్లు. కరోనా సెకండ్ లాక్ డౌన్ తర్వాత ఒక్కసారిగా టికెట్ రేట్లు బాగా పెరిగాయి. మాములు థియేటర్స్ కే బాగా పెరిగాయి అనుకుంటే మల్టిప్లెక్స్ లో అయితే సామాన్య ప్రజలకి అందనంత ఎత్తులో ఉన్నాయి. RRR, KGF లాంటాయి భారీ సినిమాలకి ఇది వర్కౌట్ అయినా చిన్న, మీడియం రేంజ్ సినిమాలకి కూడా ఇవే రేట్లు పెట్టడంతో సినిమా బాగున్నా కలెక్షన్స్ రావడం లేదు. సినిమా టికెట్ రేట్లు పెరగడంతో మామూలు ప్రజలు థియేటర్ కి దూరమవుతున్నారు.
టికెట్ రేట్లు తగ్గించాలి, తగ్గిస్తాం అని నిర్మాతలు, టాలీవుడ్ పెద్దలు చెపుతున్నా అది ఆచరణలో కనపడట్లేదు. తాజాగా రవితేజ హీరోగా రాబోతున్న ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా జులై 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జులై 24 ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లోని JRC కన్వెన్షన్ లో జరిగింది. ఈ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా న్యాచురల్ స్టార్ నాని వచ్చారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు శరత్ మండవ ఈ సినిమా టికెట్ రేట్ల గురించి మాట్లాడాడు.
Nani : ఆయనకి చిరంజీవి.. మాకు రవితేజ.. ప్రతి జనరేషన్‌కి ఒకడు ఉంటాడు..
శరత్ మండవ మాట్లాడుతూ.. ”ఈ మధ్య ఎక్కడికెళ్లినా ఒక ప్రశ్న ఎదురవుతుంది. టికెట్ రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల జనాలు రావడం లేదు అని అంటున్నారు. అందులో ఎంతవరకు నిజం ఉందో తెలీదు. ఈ సినిమాకి తెలంగాణలో మల్టీప్లెక్స్ 195, సింగిల్ స్క్రీన్స్ లో 150, 100, 50 ధరలు ఉన్నాయి. ఆంధ్రాలో మల్టీప్లెక్స్ 177, సింగిల్ స్క్రీన్ 144, 88 ఉన్నాయి. ఆన్‌లైన్‌లో బుక్ చేస్తే మళ్ళీ సపరేట్ సర్వీస్ ఛార్జ్ ఎక్కువ అవుతుంది కాబట్టి దయచేసి థియేటర్స్ కౌంటర్‌లోనే టికెట్ కొనుక్కొని చూడండి” అని అన్నారు. ఈ రేట్లు చూసి సినీ ప్రేమికులు మళ్ళీ అవే రేట్లు, సినిమాలకి కలెక్షన్స్ రాకపోయినా తగ్గించట్లేదు, థియేటర్ కి వెళ్లి సినిమా చూడొద్దా ప్రేక్షకులు అని కామెంట్స్ చేస్తున్నారు.