Lopaliki Raa Cheptha : శ్రీ విష్ణు చేతుల మీదుగా లోపలికి రా చెప్తా మూవీ నుంచి ఫోర్త్ సింగిల్ ‘టిక్ టాక్ చేద్దామా..’ రిలీజ్
కొండా వెంకట రాజేంద్ర, మనీషా జష్ణాని, సుస్మిత ఆనాల, సాంచిరాయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం లోపలికి రా చెప్తా.

Tik Tok Chedama Lyrical
కొండా వెంకట రాజేంద్ర, మనీషా జష్ణాని, సుస్మిత ఆనాల, సాంచిరాయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం లోపలికి రా చెప్తా. మాస్ బంక్ మూవీస్ బ్యానర్ పై లక్ష్మీ గణేష్, వెంకట రాజేంద్ర సంయుక్త నిర్మాణంలో హారర్ కామెడీ ఎంటర్టైనర్ గా కొండా వెంకట రాజేంద్ర దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పలు పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. జూలై 5న ప్రపంచ వ్యాప్తంగా ఈ హారర్ కామెడీ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా హీరో శ్రీ విష్ణు చేతుల మీదుగా ఈ చిత్రంలోని నాలుగో పాట ‘టిక్ టాక్ చేద్దామా..’విడుదల చేశారు.
pawan kalyan : అలా అడగ్గానే ఇలా సాయం చేసిన పవన్.. పాకిజాకు పవన్ సాయం..
మ్యూజిక్ డైరెక్టర్ దేవ్ జాండ్ కంపోజ్ చేసిన పాటలన్నీ ఛాట్ బస్టర్స్ అయ్యాయి. ఈ చిత్రం ప్రేక్షకులకు మంచి అనుభూతి ఇస్తుందని దర్శకుడు వెంకట రాజేంద్ర తెలిపారు.