అచ్చూ కత్రినా కైఫ్ లాగే : టిక్ టాక్‌లో సందడి

  • Published By: madhu ,Published On : September 19, 2019 / 04:26 AM IST
అచ్చూ కత్రినా కైఫ్ లాగే : టిక్ టాక్‌లో సందడి

Updated On : September 19, 2019 / 4:26 AM IST

టిక్ టాక్‌లో ఓ యువతి సందడి చేస్తోంది. అచ్చూ కత్రినా కైఫ్‌లా ఉందంటూ ఫాలోవర్స్ వీడియోలను తెగ షేర్ చేస్తున్నారు. అవును బాలీవుడ్ హీరోయిన్ కత్రీనాను పోలిన యువతి సందడది చేస్తోంది. ఈమె పేరు ఎలిన్ రాయ్. కొన్ని వీడియోలను టిక్ టాక్‌తో పాటు ఇన్ స్ట్రా గ్రామ్‌లో ఫొటోలు, వీడియోలను షేర్ చేసింది. ఎవరు కత్రినానో ఎవరు ఎలిన్ రాయ్ అనేది తేల్చుకోలేకపోతున్నారంట. 

ఎలిన్..టిక్ టాక్‌లో పాపులర్ స్టార్. కత్రినా లాగా ఉండడంతో ఈమె ఫేమస్ అయ్యింది. 33.5K ఫాలోవర్స్ ఉన్నారు. 2017లో సోషల్ మీడియా ప్రపంచంలోకి అడుగుపెట్టింది ఈమె. కత్రినా అంటూ కామెంట్ చేస్తుంటారు. కత్రినాలాగా ఉండటానికి ఏమైనా ప్లాస్టిక్ సర్జరీ చేశారా అంటూ ఓ నెటిజన్ ప్రశ్నించాడు. OMG టోటల్ కత్రినాలాగే ఉందని మరో ఫాలోవర్ కామెంట్ చేశాడు. 

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన భారత్‌ సినిమాలో కత్రినా హీరోయిన్‌గా నటించింది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేసిన కార్యక్రమాలకు ఈ నటి స్పందిస్తోంది. ప్లాస్టిక్‌ను నిషేధించాలని, పర్యావరణాన్ని కాపాడాలనే పిలుపుకు నటి మద్దతు పలికింది. రోహిత్ శెట్టి దర్శకత్వంలో రూపొందుతున్న సూర్య వంశీలో కత్రినా నటిస్తోంది. ఇందులో హీరోగా అక్షయ్ కుమార్ నటిస్తున్నారు.