Anupama Parameswaran : వెబ్‌సైట్‌కి అనుపమ చురకలు.. వైరల్ అవుతున్న స్క్రీన్‌షాట్..

టాలీవుడ్ వెబ్‌సైట్‌కి అనుపమ పరమేశ్వరన్ చురకలు. ఆ వెబ్‌సైట్‌తో అనుపమ చేసిన మెసేజ్‌ స్క్రీన్‌షాట్ ని షేర్ చేస్తూ..

Anupama Parameswaran : అందాల భామ అనుపమ పరమేశ్వరన్.. సౌత్‌లోని అన్ని లాంగ్వేజ్స్ లో సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. రీసెంట్ గా ఈ హీరోయిన్ ఈగల్, సైరెన్ అనే సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. ‘ఈగల్’ రవితేజ హీరోగా తెరకెక్కిన తెలుగు సినిమా, ‘సైరెన్’ తమిళ్ హీరో జయం రవి నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ.

ఈ రెండు సినిమాల్లో అనుపమ పాత్ర సపోర్టింగ్ క్యారెక్టర్ రోల్ లాగానే కనిపిస్తుంది. ఇక ఈ విషయాన్ని ఒక టాలీవుడ్ వెబ్‌సైట్ రాసుకొస్తూ.. “సైరెన్ మూవీలో అనుపమ పాత్ర కేవలం కొన్ని నిముషాలు ఉండడమే కాకుండా, డైలాగ్స్ కూడా ఉండవు” పేర్కొన్నారు. ఇక ఈ లైన్స్ పై అనుపమ రియాక్ట్ అవుతూ.. “మాటలు రాని పాత్రకి డైలాగ్స్ లేవు అని రాసిన మిమ్మల్ని అభినందించకుండా ఉండలేకపోతున్నాను” అంటూ ఆ వెబ్‌సైట్ కి మెసేజ్ చేసారు.

Also read : Singer Sagar : తండ్రి అయిన సింగర్ సాగర్‌.. కానీ దేవిశ్రీ ప్రసాద్ మాత్రం..

అలా వారికీ మెసేజ్ చేసి చురకలు అంటించడమే కాదు, ఆ చాటింగ్ ని స్క్రీన్‌షాట్ ని తన సోషల్ మీడియాలో కూడా షేర్ చేసారు. ఆ వెబ్‌సైట్ ఎలాంటి తప్పు వార్తలు రాస్తుందో అందరికి తెలియాలనే ఇలా చేస్తున్నట్లు కూడా పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ ట్వీట్ చూసిన అనుపమ అభిమానులు.. ఆ వెబ్‌సైట్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్స్ చేస్తున్నారు.

కాగా అనుపమ నటించిన కొత్త సినిమా ‘టిల్లు స్క్వేర్’ మార్చి 29న రిలీజ్ కాబోతుంది. సిద్దు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ ‘డీజే టిల్లు’కి సీక్వెల్ గా వస్తున్న ఈ మూవీ పై యూత్ లో మంచి క్రేజ్ ఉంది. ఇక రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ కూడా ఆడియన్స్ కి తెగ నచ్చేయడంతో మూవీ పై మంచి క్యూరియాసిటీ నెలకుంది. ఈ సినిమాలో అనుపమ కూడా అందాల ఆరబోస్తూ కుర్రాళ్లను హీటెక్కిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు