Singer Sagar : తండ్రి అయిన సింగర్ సాగర్‌.. కానీ దేవిశ్రీ ప్రసాద్ మాత్రం..

తండ్రి అయిన టాలీవుడ్ సింగర్ సాగర్‌. ఈ వార్త చూసి దేవిశ్రీ ప్రసాద్ అభిమానులు సంతోషిస్తూ సాగర్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కానీ అదే సమయంలోనే..

Singer Sagar : తండ్రి అయిన సింగర్ సాగర్‌.. కానీ దేవిశ్రీ ప్రసాద్ మాత్రం..

Tollywood Music Director Devi Sri Prasad brother Sagar blessed with baby boy

Updated On : February 23, 2024 / 6:53 AM IST

Singer Sagar : టాలీవుడ్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ తమ్ముడు మరియు సింగర్ సాగర్.. తండ్రి అయ్యారు. అన్న మ్యూజిక్ డైరెక్షన్ లోనే ఎన్నో పాటలు పాడి మంచి గుర్తింపు సంపాదించుకున్న సాగర్.. 2019లో ఒక ప్రముఖ డాక్టర్ మౌనికని పెళ్లి చేసుకున్నారు. ఫిబ్రవరి 21న మౌనిక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారట. ఇక ఈ వార్త తెలియడంతో ఇండస్ట్రీలోని ప్రముఖులు.. ఆ జంటకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా ఈ జంటకి గతంలోనే ఒక బిడ్డ పుట్టినట్లు సమాచారం. ఇప్పుడు ఇది రెండో సంతానం తెలుస్తుంది.

ఇది ఇలా ఉంటే, దేవిశ్రీ ప్రసాద్ అభిమానులు ఈ వార్త చూసి.. సంతోషిస్తూ సాగర్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కానీ అదే సమయంలోనే దేవిశ్రీ ప్రసాద్ ఇంకా పెళ్లి చేసుకోలేదని బాధ పడుతున్నారు. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో దేవిశ్రీ కూడా ఒకరు. గతంలో దేవిశ్రీ పెళ్లి గురించి అనేక వార్తలు వచ్చాయి. ఇండస్ట్రీలోని అమ్మాయితోనే ప్రేమలో ఉన్నట్లు, కాదు ఫ్యామిలీ సర్కిల్ లోని మరదలునే పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపించాయి.

Also read : Vyooham – Shapadham : మళ్ళీ వాయిదా పడ్డ ఆర్జీవీ ‘వ్యూహం’.. ఈసారి నారా లోకేశ్ వల్ల కాదు..

కానీ ఇవన్నీ వార్తలు వరకే నిలిచిపోయాయి. ప్రస్తుతం దేవిశ్రీప్రసాద్ వయసు 44. మ్యూజిక్ డైరెక్టర్ గా కెరీర్ లో పీక్ స్టేజిని చూస్తున్న దేవిశ్రీ.. ఈ ఏడాదైనా పెళ్లి చేసుకుంటారేమో చూడాలి. కాగా దేవిశ్రీ చేతిలో ప్రస్తుతం ఆరు సినిమాలు ఉన్నాయి. ఈ ఆరు చిత్రాలు ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్. పుష్ప 2, తండేల్, ఉస్తాద్ భగత్ సింగ్, కంగువ, రత్నం, ధనుష్-శేఖర్ కమ్ముల సినిమా ఉంది. పుష్ప 1 పాటలతో ఇంటర్నేషనల్ లెవెల్ లో కూడా తన సౌండ్ కొంతవరకు వినిపించిన దేవిశ్రీ.. పుష్ప 2తో గ్లోబల్ వైడ్ తనదైన సత్తా చాటనున్నాడని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.