Vyooham – Shapadham : మళ్ళీ వాయిదా పడ్డ ఆర్జీవీ ‘వ్యూహం’.. ఈసారి నారా లోకేశ్ వల్ల కాదు..

మళ్ళీ వాయిదా పడ్డ ఆర్జీవీ వ్యూహం, శపథం సినిమాలు. ఇక ఈసారి పోస్టుపోన్ కి కారణం నారా లోకేశ్ కాదట. మరెవరు..?

Vyooham – Shapadham : మళ్ళీ వాయిదా పడ్డ ఆర్జీవీ ‘వ్యూహం’.. ఈసారి నారా లోకేశ్ వల్ల కాదు..

Ram Gopal Varma Vyooham Shapadham Movies release dates updates

Updated On : February 22, 2024 / 7:55 PM IST

Vyooham – Shapadham : టాలీవుడ్ సెన్సేషన్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.. ఏపీ సీఎం, వైఎస్సార్సీపీ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న సినిమాలు ‘వ్యూహం’, ‘శపథం’. ఈ చిత్రాలు బయోపిక్స్ కాదు రియల్ పిక్చర్స్ అంటూ, ఈ చిత్రాలతో ఏపీ రాజకీయాలోని ఎన్నో నిజాలను బయట పెట్టబోతున్నట్లు ఆర్జీవీ చెప్పుకొచ్చారు.

ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాలు గత ఏడాది డిసెంబర్ లోనే ఆడియన్స్ ముందుకు వచ్చి ఉండాలి. కానీ ఈ సినిమాలోని సన్నివేశాలను చంద్రబాబు ప్రతిష్టను దెబ్బతీసేలా తెరకెక్కించారని నారా లోకేశ్ హైకోర్టులో కేసు వేయడంతో విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఇటీవలే ఈ మూవీ రిలీజ్ కి కోర్టు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో ‘వ్యూహం’ని ఫిబ్రవరి 23న, ‘శపథం’ని మార్చి 1న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.

Also read : Rakul Preet Singh : రకుల్ ప్రీత్ జంటకి ప్రధాని మోదీ ప్రత్యేక శుభాకాంక్షలు..

ఇక రేపు వ్యూహం రిలీజ్ కాబోతుంది అనుకుంటున్న సమయంలో.. ఇప్పుడు మళ్ళీ పోస్టుపోన్ చేస్తున్నట్లు వర్మ ట్వీట్ చేశారు. వ్యూహం సినిమాని మార్చి 1న, శపథం మూవీని మార్చి 8న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇక ఈ పోస్టుపోన్ కి నారా లోకేశ్ కాదని, కొన్ని టెక్నికల్ కారణాలు, థియేటర్లు ఏర్పాటు వలనే వాయిదా వేయడం జరుగుతుందని ఆర్జీవీ పేర్కొన్నారు.

కాగా ఈ సినిమాల కథనాల విషయానికి వస్తే.. దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి చనిపోయాక వైఎస్ జగన్ జీవితంలో 2009 నుంచి 2014 వరకు ఏం జరిగింది..? జగన్ సీఎం ఎలా అయ్యారు..? అనేవి ఈ రెండు సినిమాలను చూపించనున్నారు. దాసరి కిరణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో జగన్ పాత్రలో ‘అజ్మల్ అమీర్’, వైఎస్ భారతి రోల్ లో మానస రాధా కృషన్ నటిస్తున్నారు.