కీర్తి సురేష్ ‘పెంగ్విన్’ టైటిల్ పోస్టర్

అక్టోబర్ 17న కీర్తి సురేష్ పుట్టినరోజు సందర్భంగా ఆమె నటిస్తున్న సినిమా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్..

  • Published By: sekhar ,Published On : October 17, 2019 / 11:49 AM IST
కీర్తి సురేష్ ‘పెంగ్విన్’ టైటిల్ పోస్టర్

Updated On : October 17, 2019 / 11:49 AM IST

అక్టోబర్ 17న కీర్తి సురేష్ పుట్టినరోజు సందర్భంగా ఆమె నటిస్తున్న సినిమా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్..

‘మహానటి’ సినిమాతో జాతీయ పురస్కారం దక్కించుకున్న కీర్తి సురేష్ ప్రస్తుతం మహిళా ప్రాధాన్యమున్న సినిమాల వైపే మొగ్గుచూపుతోంది. ‘మహానటి’ తర్వాత ఆచితూచి సినిమాలు ఎంపిక చేసుకుంటుంది.

అక్టోబర్ 17న కీర్తి సురేష్ పుట్టినరోజు సందర్భంగా ఆమె నటిస్తున్న తమిళ సినిమా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. కీర్తి సురేష్ 24వ సినిమా ఇది. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ సమర్పణలో, స్టోన్ బెంచ్ ఫిలింస్ బ్యానర్‌పై.. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు ‘పెంగ్విన్’ (రైజ్ డెస్టినీడ్).. అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

Read Also : ‘శాటిలైట్ శంకర్’ : ట్రైలర్

పోస్టర్‌లో కీర్తి సురేష్ గర్భిణిగా కనబడుతుంది. ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ భాషల్లో పోస్టర్స్ రిలీజ్ చేశారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. తమిళ, తెలుగు భాషల్లో 2020 వేసవిలో ‘పెంగ్విన్’ విడుదల కాబోతోంది.