పాతికేళ్ళ ముగ్గురు మొనగాళ్ళు

1994 జనవరి 7న రిలీజ్ అయిన ముగ్గురు మొనగాళ్ళు, 2019 జనవరి 7తో, 25సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది.

  • Published By: sekhar ,Published On : January 7, 2019 / 09:40 AM IST
పాతికేళ్ళ ముగ్గురు మొనగాళ్ళు

1994 జనవరి 7న రిలీజ్ అయిన ముగ్గురు మొనగాళ్ళు, 2019 జనవరి 7తో, 25సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది.

మెగాస్టార్ చిరంజీవి తొలిసారిగా త్రిపాత్రాభినయం చేసిన సినిమా, ముగ్గురు మొనగాళ్ళు. అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై, కె.నాగబాబు నిర్మాతగా, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో, మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌‌టైనర్‌గా రూపొందిన ముగ్గురు మొనగాళ్ళు చిత్రం, 1994 జనవరి 7న రిలీజ్ అయ్యింది. 2019 జనవరి 7తో, ఈ సినిమా 25సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది.చిరు ఈ సినిమాలో పృథ్వీ, విక్రమ్, దత్తాత్రేయ అనే మూడు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసాడు.

లారీ డ్రైవర్ పృథ్వీగా రోజాతో, అసిస్టెంట్ పోలీస్ కమీషనర్ విక్రమ్‌గా నగ్మాతో, దత్తాత్రేయగా రమ్యకృష్ణతో చిరు చేసిన రొమాన్స్ కానీ, కామెడీ కానీ, చామంతి పువ్వా, పువ్వా నీకు బంతిపూల మేడ కట్టనా అంటూ వేసిన స్టెప్స్ కానీ, ప్రేక్షకులను ఓ రేంజ్‌లో అలరించాయి. చిరు తల్లిదండ్రులుగా రంగనాథ్, శ్రీవిద్య, సర్వమంగళంగా బ్రహ్మానందం నటించగా, శరత్ సక్సేనా విలన్ పాత్ర పోషించాడు.

అమ్మంటే మెరిసే మేఘం, రాజశేఖరా, చామంతి పువ్వా, కొట్టూ కొట్టూ కొబ్బరికాయ వంటి సాంగ్స్ బాగా పాపులర్ అయ్యాయి. విద్యా సాగర్ సంగీతమందించిన ముగ్గురు మొనగాళ్ళు తమిళ్‌లో అలెక్స్ పాండియన్ పేరుతో డబ్ అయ్యింది.

వాచ్ చామంతి పువ్వా సాంగ్…