Tollywood 2023 hit movie list and new directors hit list
Tollywood : ఈ నెలతో 2023 పూర్తి కావొస్తుంది. ఈ ఏడాది టాలీవుడ్ లో పెద్ద సినిమాల సందడి పెద్దగా కనిపించలేదు. చిన్న సినిమాలే పెద్ద విజయాలు అందుకుంటూ వచ్చాయి. అంతేకాదు కొత్త దర్శకులు కూడా మొదటి సినిమాతోనే తమ సత్తా ఏంటో చూపించారు. ఆ కొత్త దర్శకులు ఎవరు..? వాళ్ళు తెరకెక్కించిన సినిమాలు ఏంటో ఒక లుక్ వేసేయండి.
ఫిబ్రవరిలో మొదలయింది ఈ కొత్త దర్శకుల హవా. సుహాస్ హీరోగా షణ్ముఖ ప్రశాంత్ దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కించిన సినిమా ‘రైటర్ పద్మభూషణం’. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 12 కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకొని డబల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ తరువాత కిరణ్ అబ్బవరం హీరోగా కొత్త దర్శకుడు మురళి కిషోర్ అబ్బుర తెరకెక్కించిన ‘వినరో భాగ్యము విష్ణుకథ’ మంచి విజయానే అందుకుంది.
ఇక మార్చిలో జబర్దస్త్ వేణు దర్శకుడిగా పరిచయం అవుతూ ప్రియదర్శి హీరోగా తెరకెక్కించిన ‘బలగం’ సినిమా.. మూడు కోట్లతో తెరకెక్కి 26 కోట్లకు పైగా కలెక్ట్ చేసి ఈ ఏడాదిలోనే బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. అంతేకాదు పలు ఇంటర్నేషనల్ అవార్డులను కూడా కైవసం చేసుకుంది. ఇక అదే నెల చివరిలో హీరో నాని, శ్రీకాంత్ ఓదెలని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన సినిమా ‘దసరా’. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద 117 కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకుంది.
Also read : Samantha : కొత్త ప్రొడక్షన్ కంపెనీ స్టార్ చేసిన సమంత.. ఆ పాట నుంచి నిర్మాణ సంస్థ పేరుని స్ఫూర్తిగా..
ఆ తరువాత జూన్ లో షార్ట్ ఫిలిం నటుడు సుమంత్ ప్రభాస్ దర్శకుడిగా పరిచయం అవుతూ.. తానే నటిస్తూ తెరకెక్కించిన సినిమా ‘మేమ్ ఫేమస్’. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరువాత ఆగష్టులో కార్తికేయ హీరోగా నటిస్తూ క్లాక్స్ అనే దర్శకుడిని పరిచయం చేస్తూ ‘బెదురులంక 2012’ మూవీని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చి మంచి సక్సెస్ ని అందుకున్నారు. నెక్స్ట్ అక్టోబర్ లో ‘మ్యాడ్’ అనే సూపర్ హిట్ కాలేజీ ఎంటర్టైనర్ తో కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. రీసెంట్ గా ఈ నెలలో నాని ‘హాయ్ నాన్న’ సినిమాతో శౌరవ్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ చిత్రం కూడా ప్రస్తుతం థియేటర్స్ లో మంచి టాక్ తో హిట్ టాక్ తో నడుస్తుంది.