Samantha : కొత్త ప్రొడక్షన్ కంపెనీ స్టార్ చేసిన సమంత.. ఆ పాట నుంచి నిర్మాణ సంస్థ పేరుని స్ఫూర్తిగా..
నటిగా, బ్రాండ్ అంబాసడర్‌గా, బిజినెస్ ఉమెన్‌గా ఫుల్ స్వింగ్ లో ఉన్న సమంత తాజాగా నిర్మాతగా కూడా మారబోతున్నారు.

Tollywood star heroine Samantha starts new production company
Samantha : టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రెజెంట్ సినిమాలకు దూరంగా ఉంటూ తన ఆరోగ్యం పై దృష్టి పెట్టారు. మయోసైటిస్ నుంచి కోలుకునేందుకు చికిత్స తీసుకుంటూ వస్తున్నారు. అయితే సమంత నటనకు మాత్రమే బ్రేక్ ఇచ్చారు. బ్రాండ్ అంబాసడర్‌గా, బిజినెస్ ఉమెన్‌గా మాత్రం ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. తాజాగా సమంత నిర్మాతగా కూడా మారబోతున్నారు. సమంత కొత్తగా ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. దాని పేరుని ప్రకటిస్తూ చేస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ కూడా వేశారు.
సమంత తన కొత్త ప్రొడక్షన్ హౌస్ కి ‘త్రాలలా మూవింగ్ పిక్చర్స్’ అనే పేరుని పెట్టారు. ఈ పేరుని తన ఫేవరెట్ సాంగ్ నుంచి స్ఫూర్తి పొంది పెట్టారంటా. ప్రముఖ ఇంగ్లీష్ పాప్ సాంగ్ ‘బ్రౌన్ గర్ల్ ఇన్ ది రింగ్’లోని లిరిక్స్ లో వచ్చే ‘త్రాలలా’ అనే పదాన్ని తీసుకోని సమంత తన ప్రొడక్షన్ కి పేరుగా పెట్టారు. ఇక ఈ ప్రొడక్షన్ హౌస్ లో కొత్త టాలెంట్‌ని, న్యూ ఏజ్ మూవీ మేకర్స్ ని ప్రోత్సహిస్తూ సినిమాలు నిర్మించబోతున్నారట. కొత్త టాలెంట్ ని ప్రోత్సహించడమే కాదు.. అర్థవంతమైన, ప్రామాణికమైన మరియు యూనివర్సల్ కథలను ఈ సినిమాలో నిర్మించబోతున్నారు.
Also read : Prabhas : బుల్లి అభిమానితో ప్రభాస్ ఫోటో.. కల్కి మూవీలో..
View this post on Instagram
మరి ఈ నిర్మాణ సంస్థలో ముందుగా ఈ నటుడితో సినిమా తెరకెక్కించబోతున్నారో అనేది ఆసక్తిగా మారింది. ఇది ఇలా ఉంటే, నటిగా సమంత రీ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ అంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. కాగా సమంత నటించిన ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ రిలీజ్ కావాల్సి ఉంది. తనకి ‘ఫ్యామిలీ మ్యాన్’ వంటి వెబ్ సిరీస్ తో సూపర్ సక్సెస్ ని అందించిన రాజ్ అండ్ డీకే దర్శకులు ఈ సిరీస్ ని తెరకెక్కించారు. ఈ సిరీస్ లో వరుణ్ ధావన్ మేల్ లీడ్ లో నటిస్తున్నారు. సమంత తన డబ్బింగ్ పనులు కూడా పూర్తి చేశారు. మరి దీనిని ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి.