Tollywood Actor : స్టార్ డైరెక్టర్ ని తిట్టిన నటుడు.. మీడియాపై అరిచి.. కెమెరా చిప్‌లు విరగ్గొట్టి..
సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆ నటుడు సహనం కోల్పోయాడు. (Tollywood Actor)
Tollywood Actor
Tollywood Actor : అతను ఓ స్టార్ రచయిత, నటుడు, దర్శకుడు కూడా. గతంలో అనేక వివాదాల్లో నిలిచాడు. కొన్నాళ్ళు సినిమాల్లో గ్యాప్ తీసుకున్న ఆ నటుడు ఇటీవల ఓ సినిమాతో వచ్చాడు. ఆ సినిమాలో నటించి దర్శకత్వం కూడా చేసాడు. అయితే ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆ నటుడు సహనం కోల్పోయాడు.
సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆ నటుడు. ఆ ఇంటర్వ్యూలో గతంలో జరిగిన కొన్ని సంఘటనలను, ఓ స్టార్ దర్శకుడితో అతనికి ఉన్న వివాదం గురించి అడిగారు. దీంతో ఆ నటుడు సహనం కోల్పోయి మొదట ఆ స్టార్ దర్శకుడిని తిట్టాడు. పాతవి గుర్తుచేస్తూ ఆ దర్శకుడిని తిట్టాడు. ఆ దర్శకుడు, ఈ నటుడుకు మధ్య ఉన్న వివాదం గురించి గట్టిగానే మాట్లాడాడు.
Also Read : Akkineni Akhil : మా ఆవిడ సంగతి మీకు తెలీదు.. భార్య పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన అఖిల్..
కానీ ఏమైందో ఏమో అసలు ఈ ప్రశ్న ఎందుకు అంటూ ఆ మీడియా వ్యక్తిపై విరుచుకుపడ్డాడు నటుడు. ఆ ప్రశ్న అడిగినందుకు అతన్ని కూడా తిట్టాడు. పైగా ఇంటర్వ్యూ అయ్యాక ఆ విజువల్స్ బయటకు రాకూడదు అని ఆ నటుడు, ఆ నటుడి టీమ్ కెమెరామెన్ ని అడిగి ఆ వీడియోకి సంబంధించిన మెమరీ చిప్స్ ని తీసుకొని విరగ్గొట్టారట. దీంతో ఈ వార్త టాలీవుడ్ లో వైరల్ గా మారింది.
ఆ నటుడు ఇచ్చిన ఇంటర్వ్యూ కి సంబంధించిన మెమరీ చిప్స్ విరగ్గొట్టాడంటే అందులో ఎన్ని తిట్లు, ఎంత కంటెంట్ ఉందో అని చర్చగా మారింది. సాధారణంగా సెలబ్రిటీలు సహనం కోల్పోయి మాట్లాడటం అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. కానీ ఆయా సెలబ్రిటీలు తాము తప్పుగా మాట్లాడిన మాటలు వరకు బయటకు రాకుండా చూడమని, అవి కట్ చేసి మిగతాది టెలికాస్ట్ చేసుకోమని కోరతారు. కానీ ఈ నటుడు ఏకంగా మెమరీ చిప్స్ తీసుకొని విరగొట్టడం మీడియాలో కూడా వైరల్ గా మారింది.
