Tollywood Actress Kushitha Kallapu strong counter to Venu Swamy
Kushitha Kallapu : తెలుగు అమ్మాయి అయిన కుషిత కల్లపు సోషల్ మీడియా ద్వారా మంచి ఫేమ్ ని సంపాదించుకొని ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు. పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించినా రాని పాపులారిటీ.. ఒక్క డ్రగ్స్ కేసుతో కుషితకి వచ్చేసింది. తాము పబ్ కి వెళ్ళింది డ్రగ్స్ తీసుకోవడానికి కాదు, చీజ్ బజ్జిలు తినడానికి వెళ్ళాము అని చెప్పడంతో.. ఆ సమయంలో బజ్జిలు పాపగా ఈ అమ్మడి పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మోతమోగిపోయింది.
ఇక ఈ ఇన్సిడెంట్ ని వేణుస్వామి లాంటి వారు తమకి అనుకూలంగా మార్చుకొని తమని తాము పబ్లిసిటీ చేసుకుంటున్నారు. వేణుస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ బాగా వైరల్ అయ్యారు. అలా జరుగుతుందని ఆమెకు ముందుగానే చెప్పానని, తను చెప్పడం వల్లే అలా జరిగిందని సెలబ్రిటీస్ గురించి మాట్లాడుతూ నెట్టింట వైరల్ అవుతుంటారు.
Also read : Sophia Leone : ఒక్కొక్కరిగా అడల్ట్ స్టార్స్ మరణం.. ఇప్పుడు సోఫియా లియోన్ మృతి..
కుషిత డ్రగ్స్ కేసు విషయంలో ఈ వేణుస్వామి మాట్లాడుతూ.. “కొన్ని నెలలో నువ్వు ఫేమస్ అవుతావు అని చెప్పను. నేను చెప్పినట్లే ఆమె డ్రగ్స్ కేసుతో ఫేమస్ అయ్యింది” అంటూ వ్యాఖ్యానించారు. తాజాగా ఈ కామెంట్స్ గురించి కుషితని ప్రశ్నించగా, ఆమె బదులిస్తూ.. “నేను ఆయనని కలిసింది. ఆ డ్రగ్స్ ఇష్యూ అయిన తరువాత. దానిని ఆయనకు అనుగుణంగా ఎలా మార్చుకొని చెబుతాడు” అంటూ కౌంటర్ ఇచ్చారు.
కాగా ‘బాబు నెం.1 బుల్ షిట్ గయ్’ సినిమాతో కుషిత హీరోయిన్ గా పరిచయం అయ్యారు. ఈ సినిమా ఈ శుక్రవారం ఆడియన్స్ ముందుకు వచ్చింది. బిగ్‌బాస్ అర్జున్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని లక్ష్మణ వర్మ డైరెక్ట్ చేసారు. కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ ని బాగానే మెప్పించారు. ప్రస్తుతం థియేటర్స్ లో అందుబాటులో ఈ సినిమాని కామెడీ ఇష్టపడేవారు చూసేయండి.