Sophia Leone : ఒక్కొక్కరిగా అడల్ట్ స్టార్స్ మరణం.. ఇప్పుడు సోఫియా లియోన్ మృతి..

అడల్ట్ ఇండస్ట్రీకి చెందిన స్టార్స్ గత కొన్ని వారాలుగా ఒక్కొక్కరిగా మరణిస్తూ వస్తున్నారు. తాజాగా సోఫియా లియోన్ మృతి..

Sophia Leone : ఒక్కొక్కరిగా అడల్ట్ స్టార్స్ మరణం.. ఇప్పుడు సోఫియా లియోన్ మృతి..

Adult star Sophia Leone is passed away in mysterious way

Updated On : March 10, 2024 / 11:57 AM IST

Sophia Leone : అడల్ట్ ఫిల్మ్ స్టార్ సోఫియా లియోన్ 26ఏళ్ళ వయసులో అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఆమెను సంప్రదించడానికి కుటుంబసభ్యులు ప్రయత్నిస్తుంటే.. ఆమె నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదట. దీంతో మార్చి 1న ఆమె అపార్ట్‌మెంట్‌కు వెళ్లి చూడగా ఆమె మరణించి ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని ఆమె స్టెప్ ఫాదర్ తెలియజేసాడు.

ఆమె అంత్యక్రియలు మరియు దర్యాప్తు ఖర్చుల డబ్బు సేకరించడం కోసం GoFundMeలో షేర్ చేయడంతో ఈ విషయం ఇప్పుడు బయటకి వచ్చింది. సోఫియా మరణానికి అసలు కారణం ఏంటనేది ఇంకా తెలియలేదని, పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. కాగా మియామీలో జన్మించిన లియోన్ 18 సంవత్సరాల వయస్సులో అడల్ట్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.

Also read : Ritu Varma : మహారాణి రుక్మణీదేవిగా రీతు వర్మ.. ఫస్ట్ లుక్ అదిరింది..

కాగా కొన్ని వారాల క్రితం, మరో అడల్ట్ ఫిల్మ్ స్టార్ కాగ్నీ లిన్ కార్టర్ ఆత్మహత్య చేసుకొని మరణించింది. మరో అడల్ట్ స్టార్ ఎమిలీ విల్లిస్ అధిక మోతాదు డ్రగ్స్ తో కోమాలోకి వెళ్ళింది. అలాగే జెస్సీ జేన్ మరియు ఆమె ప్రియుడు కూడా జనవరి అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. వారు కూడా డ్రగ్స్ ఓవర్ డోస్ వల్లే చనిపోయి ఉంటారని సమాచారం. ఇప్పుడు ఈ మరణం వెనుక కారణం కూడా అదే అయ్యుంటుందని భావిస్తున్నారు.