Ritu Varma : మహారాణి రుక్మణీదేవిగా రీతు వర్మ.. ఫస్ట్ లుక్ అదిరింది..

మహారాణి రుక్మణీదేవిగా రీతు వర్మ. 'స్వాగ్' మూవీ నుంచి రిలీజైన ఫస్ట్ లుక్ అదిరింది.

Ritu Varma : మహారాణి రుక్మణీదేవిగా రీతు వర్మ.. ఫస్ట్ లుక్ అదిరింది..

Ritu Varma first look released from Swag movie on her birthday

Updated On : March 10, 2024 / 11:14 AM IST

Ritu Varma : తెలుగు అమ్మాయి అయిన రీతు వర్మ ‘అనుకోకుండా’ అనే షార్ట్ ఫిలింతో మంచి గుర్తింపుని సంపాదించుకున్నారు. దీంతో సినిమాల్లో అవకాశాలు అందిపుచ్చుకున్నారు. ఎన్టీఆర్ ‘బాద్‌షా’ సినిమాలో కాజల్ అగర్వాల్ తో పాటు నటించి సినిమా కెరీర్ ని స్టార్ట్ చేసారు. ఆ తరువాత కొన్ని సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గానే కనిపించిన రీతు.. ‘పెళ్లిచూపులు’ సినిమాతో మెయిన్ హీరోయిన్ గా మారి సూపర్ హిట్టుని అందుకున్నారు.

ఆ తరువాత నుంచి తెలుగు, తమిళంలో హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటూ ముందుకు సాగుతున్నారు. కాగా నేడు మార్చి 10న రీతు వర్మ పుట్టినరోజు. దీంతో ఆమెకు అభిమానులు, ఫిలిం మేకర్స్ శుభాకాంక్షలు తెలియజేస్తూ వస్తున్నారు. ఈక్రమంలోనే రీతు నటిస్తున్న సినిమా నిర్మాతలు కూడా విషెస్ తెలియజేస్తూ పోస్టులు వేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో రీతు ‘స్వాగ్’ అనే సినిమా చేయబోతున్నారు.

Also read : Vishwambhara : ‘విశ్వంభర’ సిస్టర్ సెంటిమెంట్‌తో రాబోతోందా.. చిరు చెల్లెళ్లు వీరేనా..

శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. గతంలో శ్రీవిష్ణుకి ‘రాజ రాజ చోర’ వంటి సూపర్ హిట్ సినిమాని అందించిన దర్శకుడు హసిత్ గోలి.. ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీని అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన గ్లింప్స్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. ‘ఈ కథ మగవాడిది, శ్వాగణిక వంశానిది’ అంటూ ఈ సినిమాని అబ్బాయిలకు బాగా కనెక్ట్ అయ్యేలా చేసారు.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గ రీతు వర్మ చేయబోతున్నారట. నేడు రీతు పుట్టినరోజు కావడంతో ఆమె ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేస్తూ విషెస్ తెలియజేసారు. ‘రాజులని తలదన్నే మా వింజామర వంశ మహారాణి రుక్మణీదేవికి జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ పోస్టు వేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లోని రీతు లుక్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. అనౌన్స్‌మెంట్ తోనే మంచి అంచనాలు క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం.. ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by People Media Factory (@peoplemediafactory)