Tollywood : జగన్‌ను కలువనున్న సినీ పెద్దలు, ఏం చర్చించనున్నారంటే

సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టిన సినీ పెద్దలు... ఏపీ సీఎం జగన్‌ను కలిసేందుకు ముహూర్తం ఖరారు చేశారు. సెప్టెంబర్ మొదటి వారంలో ఏపీ సీఎం జగన్‌ను కలవనున్నారు టాలీవుడ్ ప్రముఖులు.

Tollywood : జగన్‌ను కలువనున్న సినీ పెద్దలు, ఏం చర్చించనున్నారంటే

Jagan

Updated On : August 29, 2021 / 1:01 PM IST

CM Jagan : ఇండస్ట్రీ సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టిన సినీ పెద్దలు… ఏపీ సీఎం జగన్‌ను కలిసేందుకు ముహూర్తం ఖరారు చేశారు. సెప్టెంబర్ మొదటి వారంలో ఏపీ సీఎం జగన్‌ను కలవనున్నారు టాలీవుడ్ ప్రముఖులు. మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు ఇండస్ట్రీ పెద్దలు.. సీఎం జగన్‌తో భేటీ కానున్నారు. సీఎం జగన్ ఆహ్వానం మేరకు ఇటీవల చిరంజీవి ఇంట్లో సమావేశమైన తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు.  ప్రభుత్వం నుంచి ఆహ్వానం రావడంతో ఏం చేయాలన్న దానిపై చర్చించారు.

Read More : CM Jagan : 21 రోజుల్లోనే అర్హతను నిర్ధారించాలి, సీఎం జగన్ కీలక ఆదేశం

నిర్మాత‌ల సంఘం.. పంపిణీ, ఎగ్జిబిష‌న్ రంగాల ప్రతినిధులతో చిరంజీవి ఇప్పటికే చర్చించారు. సీఎంకి విన్నవించాల్సిన అన్ని విష‌యాల‌పైనా క్లారిటీకి వచ్చారు… టికెట్‌ రేట్లపై, గ్రామపంచాయితీ, న‌గ‌ర పంచాయితీ, కార్పొరేష‌న్ ఏరియాల్లో టిక్కెట్టు ధ‌ర‌ల‌పై, చిన్న నిర్మాత‌ల స‌మ‌స్యల‌పైనా, చిన్న సినిమాల మనుగడ కోసం తీసుకోవాల్సిన చర్యలపై సీఎంతో చర్చించనున్నారు.. ఐదో షో విషయంపై కూడా ఈ భేటీలో చర్చించే అవకాశం కనిపిస్తోంది..  ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వం నుంచి అందాల్సిన సాయంపై చర్చ జరిపే అవకాశం ఉంది..

Read More :CM Jagan – Chiru: సినీ పెద్దలతో కలిసి రమ్మంటూ మెగాస్టార్‌కు సీఎం జగన్ ఆహ్వానం

గతేడాది జూన్‌లో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు జగన్‌తో భేటీ అయ్యారు. చిరంజీవి, నాగార్జున, దర్శకుడు రాజమౌళి, నిర్మాతలు సురేశ్‌బాబు, సి.కల్యాణ్‌, దిల్‌ రాజు సీఎంను కలిసి… సినీ పరిశ్రమ అభివృద్ధి, సమస్యలు, పరిష్కారంపై చర్చించారు. మరి సీఎం జగన్ తో జరిపే చర్చల్లో ఎలాంటి సమస్యలు పరిష్కారమౌతాయో చూడాలి.