Virat Kohli : సచిన్ రికార్డు బ్రేక్ చేసిన కోహ్లీ.. టాలీవుడ్ సెలబ్రిటీస్ ట్వీట్స్..

సచిన్ రికార్డు బ్రేక్ చేసిన కోహ్లీకి అభినందనలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో టాలీవుడ్ సెలబ్రిటీస్ ట్వీట్స్.

Tollywood celebrities appreciation tweets to Virat Kohli ODI World Cup 2023

Virat Kohli : ఇన్నాళ్లు వ‌న్డే క్రికెట్‌లో అత్య‌ధిక శ‌త‌కాలు సాధించిన ఆట‌గాడిగా సచిన్ టెండూల్కర్ మొదటి స్థానంలో నిలిచారు. 452 ఇన్నింగ్స్‌ల్లో 49 శ‌త‌కాలు సాధించిన ప్లేయర్ గా స‌చిన్ ఒక రికార్డుని నెలకొల్పారు. అయితే ఈ రికార్డుని కోహ్లీ కేవలం 278 ఇన్నింగ్స్‌ల్లోనే చేరుకున్నారు. నవంబర్ 5న కోహ్లీ పుట్టినరోజు నాడు ఆస్ట్రేలియా మీద జరిగిన మ్యాచ్ లో విరాట్ తన 49వ సెంచరీ చేసి సచిన్ చెంతన చేరారు.

ఇక నేడు న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్ లో మరో శతకం సాధించి సచిన్ రికార్డుని బ్రేక్ చేశారు. ఈ రికార్డు బ్రేక్ చేయడంతో కింగ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ స్టేడియంలో సందడి చేశారు. ఈ మ్యాచ్ చూసేందుకు స‌చిన్ టెండూల్క‌ర్ కూడా హాజరుకాగా.. తన రికార్డుని బ్రేక్ చేసిన కోహ్లీని అభినందిస్తూ చప్పట్లు కొడుతూ కనిపించారు.

అలాగే టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ కూడా వాంఖ‌డే స్టేడియంలో సందడి చేశారు. అభిమానుల మధ్య కూర్చొని మ్యాచ్ ని ప్రత్యేక్షంగా వీక్షించారు. ఇక కొత్త రికార్డుని క్రియేట్ చేసిన కోహ్లీకి అభినందనలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్టు కూడా పెట్టారు. అలాగే ఎన్టీఆర్, రాజమౌళి.. తదితరులు కూడా పోస్టులు పెట్టారు.

Also read : Anchor Suma : స్టేజీపై సుమ డాన్స్ అదుర్స్.. వీడియో చూశారా..?