World Cup 2023 : వరల్డ్ కప్ ఓడిపోవడంతో.. టాలీవుడ్ సెలబ్రిటీస్ ఎమోషనల్ ట్వీట్స్..

భారత జట్టు వరల్డ్ కప్ ఓడిపోవడంతో టాలీవుడ్ సెలబ్రిటీస్ ఎమోషనల్ ట్వీట్స్ చేయగా ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.భారత జట్టు వరల్డ్ కప్ ఓడిపోవడంతో టాలీవుడ్ సెలబ్రిటీస్ ఎమోషనల్ ట్వీట్స్ చేయగా ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.

Tollywood celebrities tweets about losing of world cup 2023

World Cup 2023 : క్రికెట్ వరల్డ్ కప్ పోరు దుఃఖాంతంతో ముగిసింది. ఈ ప్రపంచ కప్ లో ప్రతి మ్యాచ్ గెలుస్తూ ఫైనల్ కి వచ్చిన భారత్ జట్టు.. తుది పోరులో ఆస్ట్రేలియాతో పోరాడి ఓడింది. అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర‌మోదీ స్టేడియంలో జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్ ని ఇండియా మొత్తం ఎన్నో ఆశలతో వీక్షించింది. 2003 ఫైనల్ మ్యాచ్ లో భారత్ ని ఓడించి ప్రపంచ కప్ ని గెలుచుకున్న ఆస్ట్రేలియాకి రోహిత్ సేన రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనే ఆశతో ప్రతి ఒక్కరు మ్యాచ్ ని కనురెప్ప కూడా వేయకుండా వీక్షించారు.

ఇక ఈ ప్రతిష్టాత్మకమైన మ్యాచ్ ని ప్రత్యేక్షంగా చూసేందుకు ప్రధాని మోదీ, అమిత్ షా, ఇండియన్ స్టార్ సింగర్ ఆశా భోంస్లే, షారుఖ్ ఖాన్, రణవీర్ సింగ్, వెంకటేష్, మహేష్ బాబు, అఖిల్ అక్కినేని, దీపికా పదుకొనె.. ఇలా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు అహ్మ‌దాబాద్‌ స్టేడియంలో సందడి చేశారు. నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో భారత్ జట్టు అల్ అవుట్ అయ్యి 240 ప‌రుగులు చేయగా.. ఆస్ట్రేలియా టీం 43 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్లు కోల్పోయి ల‌క్ష్యాన్ని ఛేదించింది. వరల్డ్ కప్ చెదరడంతో భారత్ ప్లేయర్లు కన్నీటి పర్యంతం అయ్యారు.

Also read : Allu Arjun : పుష్ప 2 షూటింగ్ అప్డేట్.. ఆ గెటప్ మేకప్ కోసం రెండు గంటలు.. అల్లు అర్జున్ డెడికేషన్‌కి హ్యాట్సాఫ్..

కన్నీళ్లతో వారిని చూసిన భారత్ అభిమానులు మరింత బాధ పడ్డారు. అయితే భారత్ టీంకి తమ సపోర్ట్ ని తెలియజేస్తూ, వారిని ఓదారుస్తూ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా ట్వీట్స్ చేస్తూ వస్తున్నారు. వెంకటేష్, మహేష్ బాబు, నాని, రామ్ గోపాల్ వర్మతో పాటు పలువురు ట్వీట్స్ చేయగా ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.