Tollywood Drug Case : పూరీని ప్రశ్నించనున్న ఈడీ.. ప్రశ్నావళి సిద్ధం
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో.. ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తీగ లాగుతోంది. 2021, ఆగస్టు 31వ తేదీ మంగళవారం నుంచి విడతల వారీగా ఈడీ ముందు హాజరుకానున్నారు

Puri
Puri Jagannath : ఈడీ స్పీడ్ పెంచింది. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో.. ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తీగ లాగుతోంది. డ్రగ్స్ కేసులో ఈడీ పలువురిని ప్రశ్నించనుంది. 2021, ఆగస్టు 31వ తేదీ మంగళవారం నుంచి విడతల వారీగా ఈడీ ముందు హాజరుకానున్నారు. పలువురు తెలుగు సినిమా స్టార్స్. మంగళవారం డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ను ఈడీ ప్రశ్నించనుంది. పూరీని ప్రశ్నించేందుకు లిఖిత పూర్వక ప్రశ్నావళి సిద్ధం చేసింది ఈడీ.
Read More : IRCTC Contest : బంపర్ ఆఫర్.. లక్ష రూపాయలు గెలుచుకునే చాన్స్.. దరఖాస్తు చేసుకున్నారా?
డ్రగ్స్ కేసులో మనీ ల్యాండరింగ్ అంశాల మీద పూరి జగన్నాథ్‌ను ప్రశ్నించనున్న ఈడీ.. డ్రగ్స్ కొనుగోళ్ల వ్యవహారం.. చేతులు మారిన కోట్ల రూపాయలు లావాదేవీలపైనా కూపీ లాగనుంది. ఎక్సైజ్ శాఖ నివేదిక ఆధారంగా.. పూరీని ప్రశ్నించనున్నారు ఈడీ అధికారులు. ప్రశ్నలకు సమాధానాలను లిఖిత పూర్వకంగా ఇవ్వాలని కోరనున్నట్లు తెలుస్తోంది. డ్రగ్స్ వాడకంపై వివరాలు సేకరించనున్న దర్యాప్తు సంస్థ.. డ్రగ్స్ హైదరాబాద్ ఎలా వస్తున్నాయి…? ఎక్కడి నుంచి వస్తున్నాయి..? డ్రగ్స్ కొనుగోలు, చెల్లింపులు ఏ విధంగా జరిగాయనే వాటిపై ఆరా తీయనుంది.
Read More :IAS Transfers : తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు
గతంలో ఓ సారి సిట్ ముందు పూరీ హాజరయ్యారు. ఇప్పుడు ఈడీ విచారణకు పిలిచింది. ఇక సెప్టెంబర్ 2న చార్మి, 6న రకుల్ ప్రీత్ సింగ్, 8న దగ్గుబాటి రానా, 9న రవితేజతో పాటు అతని అసిస్టెంట్ శ్రీనివాస్… 13న నవదీప్, 15న ముమైత్ ఖాన్, 17న తనీష్, 20న నందు, సెప్టెంబర్ 22న తరుణ్.. ఈడీ ముందు హాజరుకానున్నారు. ఇప్పటికే ఎక్సైజ్ శాఖకు చెందిన సిట్ అధికారి శ్రీనివాస్ నుంచి ఈడీ సమాచారం సేకరించింది.
Read More : Bonus for Fit People: ఫిట్‌గా ఉండే ఉద్యోగులకు నెల జీతం బోనస్
సినీతారలను విచారించిన తీరును, రాబట్టిన విషయాలను ఈడీకి వివరించారు శ్రీనివాస్. ఆయన చెప్పిన వివరాలతో టాలీవుడ్ సెలబ్రిటీలను గుచ్చిగుచ్చి ప్రశ్నించేందుకు ఈడీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇచ్చే ప్రతీ సమాధానం లిఖితపూర్వకంగా తీసుకోనుంది. 2017లో ఎక్సైజ్ శాఖ అరెస్ట్ చేసిన కెల్విన్, మైక్ కమింగా, విక్టర్ స్టేట్‌మెంట్ ఆధారంగా సినీ ప్రముఖులను ఈడీ విచారించనుంది. నిందితులతో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలతో సంబంధాలపై ఈడీ ఫోకస్ చేయనుంది. ఆస్ట్రియా, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో ఉన్న డ్రగ్స్ ముఠాల బ్యాంక్ ఎకౌంట్ వివరాలను సేకరించేందుకు ఇంటర్ పోల్ సహకారం తీసుకోనుంది ఈడీ. ఇప్పుడు ఈడీ నోటీసులు జారీ చేసిన 12మంది ప్రముఖులే కాకుండా… గతంలో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రశ్నించిన 62మందిలో మరికొందరిని కూడా ఈడీ విచారించే అవకాశం ఉంది.