Bonus for Fit People: ఫిట్‌‌గా ఉండే ఉద్యోగులకు నెల జీతం బోనస్‌

కరోనా కారణంగా ఎన్నో ఇబ్బందుల మధ్య సుదీర్ఘమైన 'వర్క్ ఫ్రమ్ హోమ్' చేసిన ఉద్యోగులు ఎట్టకేలకు ఆఫీసుల బాట పడుతున్నారు.

Bonus for Fit People: ఫిట్‌‌గా ఉండే ఉద్యోగులకు నెల జీతం బోనస్‌

Wfh

Company Offer: కరోనా కారణంగా ఎన్నో ఇబ్బందుల మధ్య సుదీర్ఘమైన ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ చేసిన ఉద్యోగులు ఎట్టకేలకు ఆఫీసుల బాట పడుతున్నారు. ఈ క్రమంలో మరియు సుదీర్ఘ పని గంటలు కోవిడ్ -19 మహమ్మారి మధ్య ఉద్యోగుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ఫలితంగా, అనేక కంపెనీలు ఈ సమస్యను చాలా తీవ్రంగా పరిగణించాయి. ఈ క్రమంలో ఆరోగ్యకరమైన జీవనశైలి విషయానికి వస్తే, ప్రమోట్ చేయడానికి, జెరోధా అనే ఆర్థిక సేవల సంస్థ ఒక ప్రత్యేక చొరవ తీసుకుంది. ఫిట్‌గా ఉన్న ఉద్యోగులకు ఒక నెల జీతం బోనస్‌గా ఇస్తామని ప్రకటించింది. అంతేకాదు.. లక్కీ డ్రాలో రూ. 10లక్షల డబ్బులు ఇస్తామని ప్రకటించింది.

జీరోధా వ్యవస్థాపకుడు మరియు CEO నితిన్ కామత్ స్వయంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఓ ట్వీట్ చేశారు. ఫిట్‌గా ఉండేందుకు ఉద్యోగులకు ఈ ఛాలెంజ్‌ను విసిరినట్లు నితిన్‌ కామత్‌ వెల్లడించారు. కంపెనీ తీసుకొచ్చిన ఛాలెంజ్‌ ద్వారా ఉద్యోగుల జీవన విధానంలో కచ్చితంగా మార్పులు వస్తాయని నితిన్‌ కామత్‌ అభిప్రాయపడ్డారు. ఈ ఛాలెంజ్‌ను పూర్తి చేసిన ప్రతి ఉద్యోగికి నెల జీతం బోనస్‌, లక్కీ డ్రా ద్వారా ఎంపికైన ఒక ఉద్యోగికి రూ.10 లక్షలు ఇస్తామని నితిన్‌ ట్విటర్‌లో వెల్లడించారు.

వర్క్ ఫ్రం హోం కారణంగా తమ ఉద్యోగుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడిందని, వారు మళ్లీ ఫిట్ నెస్‌తో వచ్చేందుకుగానూ ఈ సవాల్‌ను విసిరినట్లు కమాత్ చెప్పారు. ఉద్యోగుల జీవన విధానంలో, ఆహార విషయంలో గణనీయమైన మార్పులు వచ్చినట్లు తెలిపారు.