Manchu Mohan Babu : మోహన్ బాబు ఇంట విషాదం

టాలీవుడ్‌ సీనియర్ నటుడు మంచు మొహన్ బాబు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తమ్ముడు మంచు రంగస్వామి నాయుడు(63) గుండెపోటుతో బుధవారం కన్నుమూశారు

Manchu Mohan Babu

Manchu Mohan Babu : టాలీవుడ్‌ సీనియర్ నటుడు మంచు మొహన్ బాబు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తమ్ముడు మంచు రంగస్వామి నాయుడు(63) గుండెపోటుతో బుధవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా బాధపడుతున్నారు రంగస్వామి.. తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

చదవండి : Manchu Lakshmi ‘అఖండ’ డైలాగులు అదరగొట్టిన మంచు లక్ష్మీ.. వీడియో వైరల్..

రంగస్వామి అంత్యక్రియలు గురువారం ఉదయం 8-9 గంటల మధ్య తిరుపతి గోవింద ధామం వద్ద నిర్వహించనున్నారు. రంగస్వామి మరణంతో మోహన్ బాబు కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

చదవండి : Manchu Lakshmi : మోహన్ లాల్ సినిమాలో మంచు లక్ష్మి ఫిమేల్ లీడ్