Tollywood hero Sai Durga Tej talks about his love breakup story
Sai Durga Tej: టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లలో మెగా అల్లుడు సాయి దుర్గ తేజ్ ఒకరు. 38 వయసొచ్చినా పెళ్లి గురించి మాత్రం ఇంకా ఏ న్యూస్ చెప్పడం లేదు. కానీ, ఆయన ఏ ఈవెంట్ కి అటెండ్ అయినా కూడా అదే ప్రశ్నను ఆయన్ని అడుగుతున్నారు ఆడియన్స్. తాజాగా మరోసారి పెళ్లి ప్రశ్న ఎదురయ్యింది సాయి డదుర్గ తేజ్ కి. దాంతో, ఆయన బ్రేకప్ స్టోరీని వివరించాడు ఈ హీరో. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. సాయి దుర్గ తేజ్(Sai Durga Tej) ఇటీవల హైదరాబాద్ లో జరిగిన ఒక సదస్సుకి హాజరయ్యారు.
OG: ఓజీ లాస్ట్ డే షూట్ లో పవన్ కళ్యాణ్.. చిత్ర యూనిట్ తో స్పెషల్ ఫోటో
ఈ కార్యక్రమంలో ఆయనకు పెళ్లి గురించి ప్రశ్న ఎదురయ్యింది. దాని గురించి వివరిస్తూ.. నా లవ్ 2023లో బ్రేకప్ అయ్యింది. అది చాలా విషాదకరమైన స్టోరీ. దానికి కారణం మీడియానే. సినిమా హిట్టయింది, ఇక పెళ్లే.. ఆ అమ్మాయితో డేటింగ్, ఈ అమ్మాయితో వెడ్డింగ్ అంటూ చాలా రకాల పుకార్లు రాసేశారు. తను ఆ పుకార్లు చూసి తట్టుకోలేకపోయింది. దాంతో బ్రేకప్ చెప్పింది” అంటూ చెప్పుకొచ్చాడు సాయి దుర్గ తేజ్. అలాగే మీరంతా కాస్త సైలెంట్‌గా ఉంటే నా పెళ్లి గురించి నేనే ప్రకటిస్తాను అని చెప్పుకొచ్చాడు.
ఇక సాయి దుర్గ తేజ్ సినిమాల విషయానికి వస్తే.. ఆయన గత విరూపాక్ష భారీ హిట్ గా నిలిచింది. ఆయన కెరీర్ మొదటి వంద కోట్ల సినిమాగా నిలిచింది. ప్రస్తుతం ఆయన SYG(సంబరాల ఏటిగట్టు) అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. సరికొత్త కథా, కథనాలతో వస్తున్న ఈ సినిమాను కొత్తదర్శకుడు రోహిత్ కేపీ తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా నుండి విడుదలైన అనౌన్స్ మెంట్ వీడియోకి ఆడియన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.