OG: ఓజీ లాస్ట్ డే షూట్ లో పవన్ కళ్యాణ్.. చిత్ర యూనిట్ తో స్పెషల్ ఫోటో

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న పాన్ ఇండియా మూవీ ఓజీ(OG). స్టార్ డైరెక్టర్ సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ గ్యాంగ్ స్టార్ మూవీలో ప్రియాంక మోహనన్ హీరోయిన్ గా నటిస్తుండగా..బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ గా చేస్తున్నాడు.

OG: ఓజీ లాస్ట్ డే షూట్ లో పవన్ కళ్యాణ్.. చిత్ర యూనిట్ తో స్పెషల్ ఫోటో

Pawan Kalyan's special photo with the unit at the last day shoot of OG

Updated On : September 14, 2025 / 10:54 AM IST

OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న పాన్ ఇండియా మూవీ ఓజీ(OG). స్టార్ డైరెక్టర్ సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ గ్యాంగ్ స్టార్ మూవీలో ప్రియాంక మోహనన్ హీరోయిన్ గా నటిస్తుండగా..బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ గా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 25న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్, టీజర్స్ కి భారీ రెస్పాన్స్ రాగా సినిమా కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే? ఇటీవల విడుదలైన ఏ సినిమాకు రానంత క్రేజ్, భారీ హైప్ ఈ సినిమాకు క్రియేట్ అయ్యింది.

SSMB 29: కెన్యా షెడ్యూల్ కంప్లీట్.. ఇక ఇండియాలోనే.. ఎస్ఎస్ఏంబీ 29 క్రేజీ న్యూస్

దానికి కారణం, పవన్ కళ్యాణ్ నుంచి చాలా కాలం తరువాత డైరెక్ట్ సినిమా వస్తుండటం, గ్యాంగ్ స్టార్ బ్యాక్డ్రాప్ అవడం, జాపనీస్ సమురాయ్ కాన్సెప్ట్ తీసుకోవడం. ఇలా ప్రతీ విషయంలో ఆడియన్స్ లో ఒక క్యూరియాసిటీని క్రియేట్ చేసింది ఈ మూవీ. ఇక పవన్ కళ్యాణ్ లుక్ గురించి ఎంత చెప్పినా తక్కువే. బెల్ బాటమ్ ప్యాంట్, రిట్రో లోక్ లో చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు పవన్. ఇక అందించిన మ్యూజిక్ ఓజీకి హైప్ తీసుకురావడంలో చాలా పెద్ద పాత్ర పోషించింది.

హంగ్రీ చీతా, ఓజీ టైటిల్ సాంగ్ ఫుల్ క్రేజ్ ను తీసుకువచ్చాయి. ఆ హైప్ తోనే విడుదలకు ముందే రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది ఓజీ. ఇదిలా ఉంటే, తాజాగా ఓజీ సినిమా లాస్ట్ డే షూట్ లో పాల్గొన్నాడు పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ అందరితో ఫోటో కూడా దిగారు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి భారీ అంచనాల మధ్య వస్తున్న ఓజీ సినిమా ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.