Tollywood-Bollywood : బాలీవుడ్ హీరోలకి వణుకు పుట్టిస్తున్న టాలీవుడ్ హీరోస్..

బాలీవుడ్ ఇండస్ట్రీ కి టాలీవుడ్ ఇండస్ట్రీ కి చాలా తేడా ఉంటుంది. హీరో, హీరోయిన్స్ దగ్గరి నుండి పోల్చుకుంటే వారు మన ఇండస్ట్రీ వాళ్ళ కంటే చాలా భిన్నంగా ఉంటారు.

Tollywood heroes who are making Bollywood heroes tremble

Tollywood-Bollywood : బాలీవుడ్ ఇండస్ట్రీ కి టాలీవుడ్ ఇండస్ట్రీ కి చాలా తేడా ఉంటుంది. హీరో, హీరోయిన్స్ దగ్గరి నుండి పోల్చుకుంటే వారు మన ఇండస్ట్రీ వాళ్ళ కంటే చాలా భిన్నంగా ఉంటారు. అంతే కాకుండా సినిమా ప్రొమోషన్ విషయంలో కూడా టాలీవుడ్ కి భిన్నంగా ఉంటుంది బాలీవుడ్. సాధారణంగా టాలీవుడ్ లో ఏదన్న సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు అది చిన్న సినిమా కానీ పెద్ద సినిమా కానీ ప్రమోషన్స్ మాత్రం దుమ్ము దులిపెయ్యాలి అంతే.

పూజ కార్యక్రమాల దగ్గర నుండి మొదలు పెడితే.. రిలీజ్ అయ్యే దాక దాని హవా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. టాలీవుడ్ లో సినిమా రిలీజ్ అంటే ఓ సారి సాంగ్స్ అని టీజర్ అని ట్రైలర్ అని ఇలా వరుసగా ఈవెంట్స్ చేస్తూ, ప్రెస్ మీట్స్ నిర్వహిస్తూ నెక్స్ట్ లెవల్ ప్రమోషన్స్ చేసి హంగామా చేస్తుంటారు.కానీ బాలీవుడ్ లో మాత్రం ఇలా ఉండదు. తమ సినిమాలను అసలు ప్రమోట్ చేసుకోరు. కేవలం సోషల్ మీడియా ద్వారానే కాస్త ప్రోమోట్ చేస్తారు కానీ మన లాగా పెద్ద పెద్ద ఈవెంట్స్ అస్సలు నిర్వహించరు. కాఫీ విత్ క‌ర‌ణ్ టాక్ షోలను తమ సినిమా ప్రమోషన్ కోసం వాడుకుంటారు. కానీ మన టాలీవడ్ హీరోలు బాలీవుడ్ కి వణుకు పుట్టిస్తున్నారు. తెలుగు సినిమా ఈవెంట్స్ ను కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా నార్త్ లో కూడా చేస్తున్నారు.

Also Read : Lakshmi Manchu : బుల్లి స్కర్ట్ వేసుకొని కూతురితో డాన్స్ వేస్తున్న మంచు లక్ష్మి.. వీడియో చూశారా..

ఇక ఈ ట్రెండ్ బాహుబలితో స్టార్ట్ అయ్యి ఇప్పుడు బన్నీ వరకు చేరింది. ఇటీవల బన్నీ పుష్ప 2 ట్రైలర్ లంచ్ ఈవెంట్ ను పాట్నా లో గ్రాండ్ గా నిర్వహించారు. ఇక ఈ ఈవెంట్ కి లక్షల్లో జనాలు తరలి వచ్చారు. తెలుగు హీరోలను ఎంతో అభిమానిస్తున్నారు హిందీ ఆడియన్స్. ఇప్పటి వరకు ఇండియాలోనే ఇలాంటి అతిపెద్ద ఈవెంట్ ఎవ్వరు నిర్వహించలేదు. మొదటి సారి టాలీవుడ్ ఈ ఘనత సాధించింది. అలాగే రామ్ చ‌ర‌ణ్‌ `గేమ్ ఛేంజ‌ర్` టీజ‌ర్ ఈవెంట్ కూడా యూపీలో చేశారు. ఒకేవేళ బాలీవుడ్ గనక ఇలానే ప్రమోషన్స్ చెయ్యకుండా ఉంటే బాలీవుడ్ ని కూడా టాలీవుడ్ ఏలేయడం ఖాయమని అంటున్నారు సినీ విశ్లేషలు. మరి ఇంత పెద్ద ఈవెంట్స్ తో బాలీవుడ్ హీరోల గుండెల్లో వణుకు పుట్టిందనే చెప్పాలి.