Karthika Nair : తన పెళ్లి వీడియోని షేర్ చేసిన హీరోయిన్ కార్తీక..

రీసెంట్ గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్ కార్తీక.. తన పెళ్లి వీడియోని షేర్ చేశారు.

Karthika Nair : తన పెళ్లి వీడియోని షేర్ చేసిన హీరోయిన్ కార్తీక..

Tollywood heroine Karthika Nair shares her wedding video

Updated On : November 23, 2023 / 8:19 PM IST

Karthika Nair : టాలీవుడ్ హీరోయిన్ కార్తీక.. రీసెంట్ గా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. రోహిత్ మీనన్‌ అనే అబ్బాయితో కార్తీక.. నవంబర్ 19న ఏడడుగులు వేశారు. కేరళలోని త్రివేండ్రంలో జరిగిన ఈ వివాహానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యి కొత్త జంటకి దీవెనలు అందించారు. ఈ పెళ్లిలో కొత్త జంట ఒక ఆకర్షణ అయితే, అలనాటి తారలంతా ఒక ఫ్రేమ్ లో కనిపించడం మరో ఆకర్షణ అయ్యింది. చిరంజీవి, సుహాసిని, రాధిక, రేవతి.. తదితరులు ఈ పెళ్లి వేడుకలో సందడి చేశారు.

ఇక ఆ పెళ్ళికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను కార్తీక అభిమానులతో పంచుకుంటూ వస్తున్నారు. తాజాగా కార్తీక ఒక అందమైన పెళ్లి వీడియోని షేర్ చేశారు. “ఈ మ్యాజికల్ వీక్ గురించి వివరించడానికి నా దగ్గర పదాలు కూడా లేవు. ఈ పెళ్ళివారంలో ఎంతో ప్రేమని అందుకున్నాము” అంటూ వీడియో పోస్టు చేశారు. ఈ వీడియోతో పాటు సంగీత్ పార్టీ వీడియోని కూడా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టులు నెట్టింట వైరల్ గా మారాయి.

Also read : Animal : ‘యానిమల్’ ట్రైలర్ మెంటల్ అంటూ ప్రభాస్ కామెంట్స్..

 

View this post on Instagram

 

A post shared by Karthika Nair (@karthika_nair9)

రాధా వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయమైన కార్తీక ‘జోష్’ సినిమాతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయమయ్యారు. అయితే కార్తీక తన తల్లిలా ఇండస్ట్రీలో ఎక్కువ కాలం రాణించ లేకపోయారు. కెరీర్ మొత్తంలో కేవలం తొమ్మిది సినిమాల్లో మాత్రమే నటించారు. 2015లో చివరిగా ఒక తమిళ్ సినిమాలో నటించారు. 2017లో ‘ఆరంభ్’ అనే ఓ హిందీ టెలివిజన్ సీరియల్‌లో నటించారు. ఆ తరువాత నుంచి యాక్టింగ్ కెరీర్ కి గుడ్ బై చెప్పేసి దుబాయ్ వెళ్లి బిజినెస్ వుమెన్ గా మారారు. అక్కడ తమ ఫ్యామిలీ హోటల్స్ బిజినెస్ లు చూసుకుంటూ బిజినెస్ ఉమెన్ గా సక్సెస్ అయ్యారు.