Animal : ‘యానిమల్’ ట్రైలర్ మెంటల్ అంటూ ప్రభాస్ కామెంట్స్..

రణబీర్ కపూర్ 'యానిమల్' ట్రైలర్ మెంటల్ అంటూ ప్రభాస్ కామెంట్స్. వైరల్ అవుతున్న ప్రభాస్ పోస్ట్.

Animal : ‘యానిమల్’ ట్రైలర్ మెంటల్ అంటూ ప్రభాస్ కామెంట్స్..

Prabhas Comments about Ranbir Kapoor Animal movie trailer

Animal : టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాలీవుడ్ మూవీ ‘యానిమల్’. రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా న‌టిస్తున్న ఈ చిత్రం ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ తో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. సందీప్ వంగా ముందు నుంచి చెప్పుకొస్తునట్లే ఈ సినిమాతో మరోస్థాయి వైలెన్స్ ని ఆడియన్స్ కి చూపించబోతున్నారని ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతుంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్ ని షేక్ చేస్తుంది.

ఈ ట్రైలర్ చూసిన వారంతా సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఈక్రమంలోనే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా తన అభిప్రాయాన్ని అందరితో పంచుకున్నారు. ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో.. ట్రైలర్ అదిరిపోయిందంటూ, మెంటల్ అంటూ మూవీ టీంకి కంగ్రాట్యులేషన్స్ తెలియజేశారు. ఈ సినిమా చూడడానికి తాను ఎదురు చూస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అలాగే స్టోరీలో మూవీ ట్రైలర్ ని కూడా షేర్ చేశారు.

Prabhas Comments about Ranbir Kapoor Animal movie trailer

Also read : Bhagavanth Kesari: భగవంత్ కేసరి ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడు..? ఎక్కడ..?

కాగా ప్రభాస్, సందీప్ వంగా కలయికలో కూడా ఒక సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి ‘స్పిరిట్’ అనే టైటిల్ ని కూడా ఖరారు చేశారు. ఈ మూవీ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా..? అని రెబల్ అభిమానులంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ ప్రస్తుతం సలార్, కల్కి, మారుతీ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాల షూటింగ్ పూర్తిగా కంప్లీట్ అయిన తరువాత ప్రభాస్, సందీప్ వంగతో సినిమా మొదలు పెట్టనున్నారని సమాచారం.

ఇక ఈ ‘స్పిరిట్’ మూవీని బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ టి-సిరీస్ నిర్మించబోతోంది. ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారని టాక్ వినిపిస్తుంది. వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.