tollywood heroines with their hits in 2023 movie list details
2023 Roundup : 2023లో అరడజను మంది స్టార్ హీరోలు సైడైపోయారు. కానీ హీరోయిన్స్ మాత్రం సై అంటే సై అన్నారు. గ్యాప్ ఇవ్వకుండా సినిమాలు చేసి.. ఆడియన్స్ ని కిర్రెక్కించారు. అదిరిపోయే యాక్టింగ్ తో మెస్మరైజ్ చేశారు. హీరోలతో పోటీపడి నటించి మతులుపోగొట్టారు. హీరోయిన్స్ ని కూడా 2023 అస్సలు నిరాశపర్చలేదు. ముద్దుగుమ్మలు బాగానే మెరిశారు.
శృతి హాసన్..
2023 శృతి హాసన్ కి సూపర్ గా కలిసొచ్చింది. ఈ ఏడాది శృతి చేసిన మూడు సినిమాలు అదరగొట్టేశాయి. ఇయర్ స్టార్టింగ్ లోనే వచ్చిన వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య మూవీస్ లో హీరోయిన్ గా నటించి సందడి చేసింది. ఈ రెండు సినిమాలు హిట్టయ్యాయి. లేటెస్ట్ గా ప్రభాస్ సలార్ తో పాన్ ఇండియా లెవల్ లో సక్సెస్ ని అందుకుంది. అంతేకాదు, నాని హాయ్ నాన్నలో ఓ స్పెషల్ సాంగ్ చేసింది. హాయ్ నాన్న కూడా పాజిటివ్ టాక్ ని సంపాదించుకుంది. మొత్తంగా 2023లో హీరోయిన్స్ అందరిలోనూ శృతి టాప్ ప్లేస్ లో నిలిచింది.
రష్మిక..
క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ తో నేషనల్ క్రష్ గా మారిన రష్మికకు కూడా ఇయర్ ఎండింగ్ లో భారీ హిట్టుపడింది. యానిమల్ మూవీలో రణ్‌బీర్ కపూర్ తో పోటీపడి నటించి ఆడియన్స్ ని మెప్పించింది. రష్మిక కెరీర్ లో పుష్ప తర్వాత అంతకు మించిన బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది యానిమల్. 2023 పోతూ పోతూ రష్మికని ఖుషీ చేస్తూనే వెళ్తుంది.
Also read : Payal Rajput : హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఇంట్లో విషాదం.. సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్
శ్రీలీల..
2023లో మారుమోగిన మరో పేరు శ్రీలీల. అందరికీ హాట్ ఫేవరెట్ గా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. హిట్లు లేకపోయినా క్రేజ్ మాత్రం విపరీతంగా ఉంది. టాలీవుడ్ లో బిజియెస్ట్ హీరోయిన్ గా మారిపోయింది శ్రీలీల. ఇటీవల హీరోయిన్ గా చేసిన సినిమాలు ప్లాప్ అయినా.. స్ట్రాంగ్ సపోర్టింగ్ రోల్ చేసి భగవంత్ కేసరితో హిట్టు కొట్టింది. అమ్మడు జోరు ఇప్పుడు మామూలుగా లేదు. రాబోయ్ స్టార్ హీరోల సినిమాలన్నింటిలోనూ శ్రీలీల తళుక్కుమనబోతుంది. 2023లో లక్కీయెస్ట్ హీరోయిన్ ఎవరంటే ఖచ్చితంగా శ్రీలీల పేరే చెబుతారు ఎవరైనా.
సంయుక్త మీనన్..
శృతి హాసన్ తర్వాత.. 2023లో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ కొట్టిన మరో హీరోయిన్ సంయుక్త మీనన్. ఫిబ్రవరిలో వచ్చిన ‘సార్’ మూవీలో నటించి.. మాస్టారు మాస్టారు అంటూ అందరి మనసుల్ని దోచేసింది. ఆ తర్వాత విరూపాక్ష మూవీలో ఎవ్వరూ ఎక్స్ పెక్ట్ చేయని క్యారెక్టర్ లో నటించి.. అందరినీ సర్ ప్రైజ్ చేసింది. కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమాతో 2023 జర్నీని ముగించింది సంయుక్త. మొత్తానికి తన మార్క్ చూపించింది.
అనుష్క, కాజల్, సమంత..
2023లో ఇద్దరు సీనియర్ హీరోయిన్స్ బౌన్స్ బ్యాక్ అయ్యారు. భాగమతి తర్వాత అనుష్క మరోసారి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీతో అలరించింది. మంచి సక్సెస్ ని అందుకుంది. ఇక సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన కాజల్.. భగవంత్ కేసరితో హిట్ కొట్టి ఫుల్ ఫామ్ లోకి వచ్చింది. శాకుంతలం డిసప్పాయింట్ చేసినా విజయ్ దేవరకొండతో ఖుషీ మూవీ చేసి.. సక్సెస్ ని అందుకుంది సమంత. ఇలా ముగ్గురు సీనియర్స్ ని 2023 సీన్ లోకి తీసుకొచ్చింది.