Payal Rajput : హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఇంట్లో విషాదం.. సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్
హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది.

Payal Rajput
Payal Rajput pet dog candy : పాయల్ రాజ్‌పుత్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన పని లేదు. ఆర్ఎక్స్ 100 చిత్రంతో యువత హృదయాలను కొల్లగొట్టింది ఈ భామ. ఇటీవల అజయ్ భూపతి దర్శకత్వంలో మంగళవారం చిత్రంతో ప్రేక్షకుల ముందు వచ్చింది. చాన్నాళ్లుగా వేచి చూస్తున్న విజయాన్ని ఈ చిత్రం పాయల్‌కు అందించింది. దీంతో పాయల్ మంచి జోష్‌లో ఉంది. ఇదే ఉత్సాహంలో న్యూ ఇయర్‌కు స్వాగతం పలకాలని భావించిన పాయల్‌కు షాక్ తగిలింది.
ఇయర్ ఎండింగ్లో ఆమె ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. పాయల్ ఎంతో ప్రేమగా పెంచుకున్న పెంపుడు కుక్క క్యాండీ మరణించింది. ఈ విషయాన్ని పాయల్ స్వయంగా వెల్లడించింది. క్యాండీతో తనకు ఉన్న అనుబంధాన్ని పాయల్ సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది.. నన్ను క్షమించు, నిన్ను బతికించుకోలేకపోయాను అంటూ ఎమోషనల్ అయింది. క్యాండీని గుర్తు చేసుకుంటూ పలు వీడియోలను పంచుకుంది.
Naa Saami Ranga : ఒక్క పాట కోసం ఆస్కార్ టీంని తీసుకొచ్చిన నాగార్జున.. నా సామిరంగ..
View this post on Instagram
‘ఇంకా నువ్వు నా పక్కనే ఉన్నట్లు అనిపిస్తోంది.. నీ హగ్స్, ప్రేమని ఎంతో మిస్ అవుతాను. ప్రేమ అంటే ఏంటో తెలిసేలా చేశావ్.. నిన్ను ఎంతో ప్రేమించా.. జీవితాంతం మిస్ అవుతూనే ఉంటా.. నువ్వు ఎక్కడున్నా నీ ఆత్మకు శాంతి చేకూరాలి. ‘అని పాయల్ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది.