Naa Saami Ranga : ఒక్క పాట కోసం ఆస్కార్ టీంని తీసుకొచ్చిన నాగార్జున.. నా సామిరంగ..
నా సామిరంగ ఒక్క పాట కోసం నాగార్జున ఆస్కార్ టీంని తీసుకొచ్చారు. అయితే ఒక్కరు మాత్రం మిస్సింగ్.

Nagarjuna brings oscar team for Naa Saami Ranga title song
Naa Saami Ranga : టాలీవుడ్ మన్మథుడు నాగార్జున చాలా గ్యాప్ తీసుకోని తన 99వ సినిమా ‘నా సామిరంగ’ని అనౌన్స్ చేశారు. రూరల్ బ్యాక్‌డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ మూవీలో నాగ్ ఊర మాస్ రోల్ లో కనిపించబోతున్నారు. లవ్ అండ్ ఫ్రెండ్‌షిప్ నేపథ్యంతో వస్తున్న ఈ చిత్రంలో నాగార్జునతో పాటు మరో ఇద్దరు హీరోలు అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హీరోయిన్స్ గా ఆషికా రంగనాథ్, మిర్నా మీనన్ నటిస్తున్నారు.
సంక్రాంతి రిలీజ్ కి సిద్దమవుతున్న ఈ సినిమా నుంచి ఒక్కో సాంగ్ రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. ఈక్రమంలోనే తాజాగా మూవీ టైటిల్ సాంగ్ ని రిలీజ్ చేశారు. ఇక ఈ పాట కోసం నాగార్జున ఆస్కార్ టీంని మళ్ళీ ఓ చోటుకి తీసుకొచ్చారు. సంగీత దర్శకుడు కీరవాణి, లిరిక్ రైటర్ చంద్రబోస్ ఆస్కార్ అందుకున్న విషయం తెలిసిందే. ‘నా సామిరంగ’ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తుంటే, ఈ టైటిల్ సాంగ్ కి చంద్రబోస్ లిరిక్స్ సమకూర్చారు.
Also read : Guntur Kaaram : బలుపు అనుకుంటారేమో.. కానీ ఆ విషయంలో గుంటూరు కారం తప్పకుండా.. నిర్మాత కామెంట్స్
అలాగే ఆస్కార్ వేదిక పై ‘నాటు నాటు’ సాంగ్ పర్ఫార్మెన్స్ చేసిన సింగర్స్ కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్.. ఈ టైటిల్ పాటని పాడారు. ఈ పాటకి పని చేయడంలో ఆస్కార్ వరకు వెళ్లిన ఒక్క డాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ మాత్రమే మిస్ అయ్యారు. ‘నా సామిరంగ’ టైటిల్ సాంగ్ కి దినేష్ కుమార్ డాన్స్ కోరియోగ్రఫీ చేశారు. కాగా ఆస్కార్ వరకు వెళ్లిన నలుగురు.. నాగార్జున పాట కోసం పని చేయడంతో అక్కినేని అభిమానులు ఈ విషయాన్ని వైరల్ చేస్తున్నారు.
ఇక సినిమా విషయానికి వస్తే.. ఈ మూవీ మలయాళ సూపర్ హిట్ మూవీ ‘పోరింజు మరియం జోస్’కి రీమేక్ గా తెరకెక్కుతుంది. స్నేహం, ప్రేమ, రివెంజ్ డ్రామాతో ఈ సినిమా కథ జరుగుతుంది. చిట్టూరి శ్రీనివాస నిర్మిస్తున్న ఈ మూవీ సంక్రాంతి పండక్కి జనవరి 14న రిలీజ్ కాబోతుంది.