Horror Movie : హారర్ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్.. స్మశానంలో.. ఇదెక్కడి ప్రమోషన్ రా బాబు..

టాలీవుడ్ లో ఇటీవల భయపెట్టే హారర్ సినిమాలు కూడా చాలా వస్తున్నాయి. ఈ క్రమంలోనే త్వరలో రాబోయే ఓ హర్రర్ సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్ లాంటి ఒక ఫంక్షన్ ని..

  • Updated on- February 22, 2024 / 10:47 AM IST

Tollywood Horror Movie Team wants to do Pre Release Event in Graveyard

Horror Movie : ఇటీవల సినిమాలు ప్రమోషన్స్ చాలా కొత్త కొత్తగా చేస్తున్నాయి. తమ సినిమాని జనాల వద్దకు తీసుకెళ్లడానికి మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో కొత్త పుంతలు తొక్కుతుంది. కొంతమంది కాలేజీలకు, హోటల్స్ కి, మాల్స్ కి, ఆఖరికి రోడ్ల మీద, ట్రైన్స్ లో.. కూడా సినిమా ప్రమోషన్స్ చేస్తూ తమ సినిమాలకి కొత్త రకం పబ్లిసిటీ చేస్తున్నారు. తాజాగా ఓ హారర్ సినిమా మూవీ యూనిట్ ఒక అడుగు ముందుకేసి సరికొత్తగా ఆలోచించింది.

టాలీవుడ్ లో ఇటీవల భయపెట్టే హారర్ సినిమాలు కూడా చాలా వస్తున్నాయి. ఈ క్రమంలోనే త్వరలో రాబోయే ఓ హర్రర్ సినిమాకి టీజర్ లాంచ్ ఈవెంట్ ని హైదరాబాద్ బేగంపేట స్మశానంలో చేయాలని అనుకున్నట్టు టాలీవుడ్ సమాచారం. ఆల్రెడీ స్మశానం లొకేషన్ కూడా చూసి వచ్చారంట ఆ మూవీ యూనిట్. అయితే ఆ సినిమా అంజలి నటిస్తున్న గీతాంజలి సీక్వెల్ సినిమా అని తెలుస్తుంది

Also Read : Bellamkonda Sreenivas : ఏ హీరో సాధించలేని రికార్డ్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చేతిలో.. ఏకంగా మూడు సినిమాలతో..

ఫిబ్రవరి 24 శనివారం రాత్రి 7 గంటలకు గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా టీజర్ లాంచ్ ని బేగంపేట్ స్మశాన వాటికలో నిర్వహించనున్నట్టు సమాచారం. దీంతో టాలీవుడ్ ఆశ్చర్యపోతుంటే ఇది తెలిసిన జనాలు మాత్రం ఇలా కూడా ప్రమోషన్స్ చేస్తారా? మరీ ఓవర్ గా అనిపించట్లేదా? అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.