Tollywood movies Love Me prathinidhi 2 love mouli was postponed
Tollywood : తెలుగు రాష్ట్రాల్లో వచ్చే రెండు నెలల్లో ఎన్నికల ఫీవర్ ఉండబోతుంది. దీంతో టాలీవుడ్ కి సంబంధించిన ఏ బడా మూవీ బాక్స్ ఆఫీస్ వద్దకు వచ్చేందుకు సిద్దమవ్వడం లేదు. ఇక ఈ గ్యాప్ ని చిన్న సినిమాలు అవకాశంగా తీసుకోని ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే ఈ చిన్న సినిమాలకు ఇప్పుడు ఓ సమస్య ఇబ్బందిగా మారిందట. దీంతో పలు సినిమా వాయిదా పడుతున్నాయి.
గత వారం రిలీజ్ అవ్వాల్సిన ‘శశివదనే’ మూవీ పోస్టుపోన్ అయ్యింది. ఇందుకు కారణం సెన్సారు పూర్తి కాకపోవడమే అని సమాచారం. సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అధికారి విదేశాలకు వెళ్లడంతో శశివదనే రిలీజ్ వాయిదా పడినట్లు ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులు చెబుతున్నారు. ఇప్పుడు ఇదే సమస్య టాలీవుడ్ లోని మరికొన్ని చిత్రాలకు కూడా ఎదురవుతున్నట్లు తెలుస్తుంది.
Also read : Varalaxmi Sarathkumar : సినిమా రివ్యూలపై వరలక్ష్మి శరత్ కుమార్ సెన్సషనల్ కామెంట్స్.. మీకేం అర్హత ఉంది..?
దిల్ రాజు నిర్మాణంలో ఆశిష్ హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా తెరకెక్కిన లవ్ రొమాంటిక్ మూవీ ‘లవ్ మీ’.. ఈ వారం ఏప్రిల్ 25న ఆడియన్స్ ముందుకు రావాల్సింది. కానీ ఈ చిత్రం ఇప్పుడు వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మే 25కి ఈ సినిమాని పోస్టుపోన్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసారు. ఈ చిత్రంతో పాటు ఈ వారం రావాల్సిన నవదీప్ ‘లవ్ మౌళి’ కూడా వాయిదా పడింది. కానీ నెక్స్ట్ రిలీజ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు.
అలాగే నారా రోహిత్ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ ‘ప్రతినిధి 2’ కూడా వాయిదా పడింది. ప్రస్తుతం ఈ మూవీ రిలీజ్ పై కూడా సస్పెన్స్ నెలకుంది. వీటితో పలు చిన్న సినిమాలు కూడా వాయిదా పడినట్లు సమాచారం. వీటన్నిటికీ సెన్సార్ కాకపోవడమే సమస్య అన్నట్లు తెలుస్తుంది. మరి ఈ సమస్య ఈ వారంతో తీరిపోతుందా..? లేక నెక్స్ట్ రిలీజ్ కావాల్సిన చిత్రాలు పై ప్రభావం చూపిస్తుందా అనేది చూడాలి.