Varalaxmi Sarathkumar : సినిమా రివ్యూలపై వరలక్ష్మి శరత్ కుమార్ సెన్సషనల్ కామెంట్స్.. మీకేం అర్హత ఉంది..?
సినిమా రివ్యూలపై వరలక్ష్మి శరత్ కుమార్ సెన్సషనల్ కామెంట్స్ చేసారు. అసలు మీకేం అర్హత ఉందని రివ్యూలు ఇస్తున్నారు.

Varalaxmi Sarathkumar sensational comments about cinema reviews in Sabari movie promotions
Varalaxmi Sarathkumar : టాలెంటెడ్ యాక్ట్రెస్ వరలక్ష్మి శరత్ కుమార్.. నెగిటివ్ క్యారెక్టర్స్ అండ్ సపోర్టింగ్ రోల్స్ తో టాలీవుడ్ లో మంచి ఫేమ్ ని సంపాదించుకున్నారు. ఒక పక్క బడా ప్రాజెక్ట్స్ లో బలమైన పాత్రలు పోషిస్తునే, అప్పుడప్పుడు లేడీ ఓరియంటెడ్ సినిమాలతో కూడా ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. తాజాగా ఈ నటి ‘శబరి’ అనే లేడీ ఓరియంటెడ్ మూవీతో రాబోతున్నారు.
ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ లో ఉన్న వరలక్ష్మి.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇక ఈ ఇంటర్వ్యూలో సినిమా రివ్యూలు ఇచ్చే వారిపై సెన్సషనల్ కామెంట్స్ చేసారు. రివ్యూలు గురించి ఆమె మాట్లాడుతూ.. “నేను అసలు సినిమా రివ్యూలు చదవను. ఒకవేళ నా దగ్గర ఎవరైనా వాటి గురించి మాట్లాడినా నాకు కోపం వస్తుంది. అయినా అసలు రివ్యూలు రాసే వారికీ ఏం అర్హత ఉందని రాసుకొస్తున్నారు. బాగున్నా సినిమాకి కూడా తమ వ్యూలు కోసం నెగటివ్ రివ్యూలు రాసి నాశనం చేస్తున్నారు. ఒకప్పుడు ఇలా ఉండేది కాదు. కనీసం ఒక ఐదు రోజులు అయినా రివ్యూలు ఇవ్వడం ఆపండి” అంటూ వైరల్ కామెంట్స్ చేసారు.
Also read : Kalki 2898 AD : కల్కి మూవీ సెట్స్‌లో నాగ్ అశ్విన్ బర్త్ డే సెలబ్రేషన్స్.. డ్యాన్స్ వీడియో వైరల్..
ఇక ‘శబరి’ సినిమా విషయానికి వస్తే.. మదర్ సెంటిమెంట్ తో ఈ మూవీ ఆడియన్స్ ముందుకు రాబోతుంది. కొత్త దర్శకుడు అనిల్ కాట్జ్ తెరకెక్కించిన ఈ చిత్రం సైకలాజికల్ థ్రిల్లర్ గా రాబోతుంది. పాన్ ఇండియా వైడ్ ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మిస్తున్న ఈ చిత్రం మే 3న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.