Kalki 2898 AD : కల్కి మూవీ సెట్స్‌లో నాగ్ అశ్విన్ బర్త్ డే సెలబ్రేషన్స్.. డ్యాన్స్‌ వీడియో వైరల్..

కల్కి మూవీ సెట్స్‌లో నాగ్ అశ్విన్ బర్త్ డే సెలబ్రేషన్స్. అన్న షర్ట్ ఏస్తే మాస్..

Kalki 2898 AD : కల్కి మూవీ సెట్స్‌లో నాగ్ అశ్విన్ బర్త్ డే సెలబ్రేషన్స్.. డ్యాన్స్‌ వీడియో వైరల్..

nag ashwin birthday celebrations at Prabhas Kalki 2898 AD shooting sets

Updated On : April 24, 2024 / 11:52 AM IST

Kalki 2898 AD : ప్రభాస్ నటిస్తున్న ‘కల్కి 2898 ఏడి’ మూవీని దర్శకుడు నాగ్ అశ్విన్.. హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కిస్తూ టాలీవుడ్ ఆడియన్స్ ముందుకు ఓ అద్భుతాన్ని తీసుకు వచ్చేందుకు కృషి చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ స్టోరీ లైన్ చెప్పి ఆడియన్స్ లో భారీ అంచనాలు క్రియేట్ చేసారు. వాటికీ తగ్గట్లే గ్లింప్స్ తో కూడా మెప్పించారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఇంకా జరుగుతూనే ఉంది.

ఇక ఈ షూటింగ్ సెట్స్ లో నాగ్ అశ్విన్ బర్త్ డేని చిత్ర యూనిట్ గ్రాండ్ గా నిర్వహించింది. నాగార్జున ‘మాస్’ మూవీ టైటిల్ సాంగ్ ని ప్లే చేస్తూ చిత్ర యూనిట్ అంతా నాగ్ అశ్విన్ తో కలిసి డ్యాన్స్ లు చేస్తూ ఎంజాయ్ చేసారు. అయితే ఈ వీడియోలో ప్రభాస్ మాత్రం కనిపించలేదు. ప్రస్తుతం అయితే ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Also read : Pat Cummins : తెలుగు డైలాగ్స్ చెప్పిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్.. పవన్ మ్యానరిజంతో..

కాగా ప్రభాస్ తన సోషల్ మీడియా ద్వారా నాగ్ అశ్విన్ కి బర్త్ డే విషెస్ ని తెలియజేసారు. “అద్భుతమైన దర్శకుడు నాగ్ అశ్విన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు. కల్కి విషయంలో నీ విజన్ నాకు స్ఫూర్తిని ఇస్తుంది” అంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా విషెష్ చెప్పుకొచ్చారు.

ఇది ఇలా ఉంటే, ఈ మూవీ నుంచి రీసెంట్ గా అమితాబ్ బచ్చన్ పాత్రని పరిచయం చేస్తూ ఓ గ్లింప్స్ ఆడియన్స్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ తరహాలోనే మూవీలోని మరికొన్ని ముఖ్యమైన పాత్రలకు సంబంధించిన గ్లింప్స్ లు కూడా ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్దమవుతున్నాయని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఈ వీక్ లోనే అందుకు సంబంధించిన అప్డేట్ కూడా రానుందని సమాచారం.