Pat Cummins : తెలుగు డైలాగ్స్ చెప్పిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్.. పవన్ మ్యానరిజంతో..

తెలుగు డైలాగ్స్ చెప్పిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అంటూ..

Pat Cummins : తెలుగు డైలాగ్స్ చెప్పిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్.. పవన్ మ్యానరిజంతో..

Pat Cummins said Mahesh Babu Allu Arjun Pawan Kalyan dialogues

Updated On : April 24, 2024 / 10:01 AM IST

Pat Cummins : ప్రస్తుతం ఐపీఎల్ ఫీవర్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఐపీఎల్ లో మన హైదరాబాద్ టీం సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకు వెళ్తుంది. అందుకు కారణం కెప్టెన్ పాట్ కమ్మిన్స్ అనే చెప్పాలి. ఒకప్పుడు 150 పైగా రన్స్ కొట్టడానికి కూడా ఇబ్బంది పడే సన్‌రైజర్స్ హైదరాబాద్ టీంని.. ఇప్పుడు 250 దాటి పరుగులు పెట్టిస్తున్నాడు. దీంతో ఈ ఆస్ట్రేలియన్ ఆటగాడికి తెలుగులో మంచి క్రేజ్ లభించింది.

ఇది ఇలా ఉంటే, ఈ విదేశీ ఆటగాడు తాజాగా తెలుగు హీరోల డైలాగ్స్ చెప్పి విజుల్స్ ని అందుకుంటున్నాడు. ‘ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను’ అంటూ మహేష్ బాబు డైలాగ్ ని చెప్పిన కమ్మిన్స్ ఆ తరువాత అల్లు అర్జున్ డైలాగ్స్ కూడా చెప్పి ఆకట్టుకున్నాడు. “కమ్మిన్స్ అంటే క్లాస్ అనుకున్నావా? మాస్ ఊరమాస్, SRH అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైరూ” అంటూ మాస్ డైలాగ్స్ చెప్పి సూపర్ అనిపించాడు.

Also read : Tollywood : ఈ ఏడాది బాలీవుడ్‌ని టాలీవుడ్ హీరోలే కాపాడాలి అంటున్న హిందీ క్రిటిక్స్..

ఇక చివరిగా ఎటువంటి డైలాగ్ లేకుండా, కేవలం పవన్ కళ్యాణ్ మ్యానరిజంతో విజుల్స్ అందుకుంటున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన టాలీవుడ్ అభిమానులు.. కమ్మిన్స్ పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఆ డైలాగ్ వీడియోలను మీరు కూడా చూసేయండి.

కాగా పాట్ కమ్మిన్స్ రీసెంట్ గా మహేష్ బాబుని కలుసుకున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం మెంబెర్స్ తో కలిసి మహేష్ బాబు ఏదో ప్రమోషనల్ కంటెంట్ ని షూట్ చేసినట్లు తెలుస్తుంది. ఆ ప్రమోషనల్ కంటెంట్ వీడియో ఏంటి అనేది ఇంకా తెలియలేదు గాని, అందుకు సంబంధించిన ఫోటోలు మాత్రం బయటకి వచ్చి బాగా వైరల్ అయ్యాయి.