Tollywood Movies : బాలీవుడ్ టాప్ 10 థియేట్రికల్ రైట్స్ తెలుగు సినిమాలు ఇవే.. ఫస్ట్ ప్లేస్‌లో ‘పుష్ప 2’ మరి లాస్ట్ ఏంటి..?

ఇప్పుడు రాబోయే సినిమాలు, ఆల్రెడీ రిలీజయిన సినిమాల్లో బాలీవుడ్ లో అత్యధిక థియేట్రికల్ రైట్స్ కు అమ్ముడు పోయిన టాప్ 10 సినిమాలు ఇవే.

Tollywood Movies : కరోనా తర్వాత మన తెలుగు సినిమాలకు బాలీవుడ్(Bollywood) లో బాగా డిమాండ్ పెరిగిన సంగతి తెలిసిందే. బాహుబలి సినిమా నుంచే దేశమంతా మన తెలుగు సినిమాల వైపు చూస్తుంది. మన తెలుగు సినిమాలను భారీ డబ్బులిచ్చి మరీ కొనుక్కుంటున్నారు హిందీ డిస్ట్రిబ్యూటర్స్. ఇక స్టార్ హీరోల సినిమాలు, క్రేజ్ ఉన్న సినిమాలను అయితే వందల కోట్లు ఇచ్చి కొనుక్కోడానికి కూడా రెడీ అవుతున్నారు బాలీవుడ్ సంస్థలు.

బాలీవుడ్ స్టార్ డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడాని ఇప్పటికే బాహుబలి, హనుమాన్, KGF, కాంతార.. లాంటి సూపర్ హిట్ ఫిలిమ్స్ అన్నీ బాలీవుడ్ లో రిలీజ్ చేసి సూపర్ సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు వరుసగా టాలీవుడ్ భారీ సినిమాలన్నీ కొనేస్తున్నారు. పుష్ప 2, దేవర, కల్కి, గేమ్ ఛేంజర్ సినిమాల హిందీ రైట్స్ ఇటీవల అనిల్ తడాని భారీ రేటుకు కొనుక్కున్నాడు. ఇప్పుడు రాబోయే సినిమాలు, ఆల్రెడీ రిలీజయిన సినిమాల్లో బాలీవుడ్ లో అత్యధిక థియేట్రికల్ రైట్స్ కు అమ్ముడు పోయిన టాప్ 10 సినిమాలు ఇవే.

Love Mouli : నవదీప్ ‘లవ్ మౌళి’ సినిమాకు సెన్సార్ ఇబ్బందులు.. ఆ సీన్స్ వల్లే.. ?

#అల్లు అర్జున్ పుష్ప(Pushpa) సినిమా బాలీవుడ్ లో భారీ హిట్ అవ్వడంతో రాబోయే పుష్ప 2 సినిమాపై అక్కడ కూడా భారీ అంచనాలు ఉన్నాయి. అనిల్ తడాని పుష్ప 2 సినిమా హిందీ రైట్స్ ని ఏకంగా 200 కోట్లు ఖర్చుపెట్టి మరీ కొనుక్కున్నాడని సమాచారం.

#పుష్ప 2 తర్వాత RRR సినిమా రెండో ప్లేస్ లో ఉంది. రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ బ్రాండ్స్ ఉండటంతో అప్పట్లోనే ఈ సినిమా హిందీలో 100 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది.

#ప్రభాస్ రాబోయే కల్కి 2898AD సినిమా కూడా 100 కోట్ల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చేసింది.

#రామ్ చరణ్ రాబోయే గేమ్ ఛేంజర్(Game Changer) సినిమాని ఏకంగా 75 కోట్లకు హిందీ థియేట్రికల్ రైట్స్ కొనుక్కున్నారని సమాచారం.

#గత సంవత్సరం వచ్చిన ప్రభాస్ సలార్(Salaar) సినిమా కూడా 75 కోట్లకు హిందీ రైట్స్ అమ్ముడుపోయాయి.

#ఆ తర్వాత ప్రభాస్ ఆదిపురుష్ సినిమా దాదాపు 72 కోట్లకు హిందీ రైట్స్ అమ్ముడయ్యాయి.

#రాజమౌళి బాహుబలి(Bahubali) సినిమాతో వచ్చిన బజ్ తో అప్పట్లోనే బాహుబలి 2 సినిమా ఏకంగా 70 కోట్లకు హిందీ థియేట్రికల్ బిజినెస్ జరిగింది.

#బాహుబలి తర్వాత వచ్చిన ప్రభాస్ సాహో సినిమా కూడా బాలీవుడ్ లో 65 కోట్ల బిజినెస్ చేసింది.

#ఆ తర్వాత ప్లేస్ లో ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా 50 కోట్ల బిజినెస్ తో నిలిచింది.

#ఇక రాబోయే ఎన్టీఆర్ దేవర(Devara) సినిమా పదో ప్లేస్ లో 45 కోట్లతో నిలిచింది. ఇటీవలే దేవర సినిమా హిందీ రైట్స్ ని 45 కోట్లతో కొనుక్కున్నట్టు సమాచారం.

Sreeleela : అయ్య బాబోయ్.. ఆ స్కూల్స్ కోసం యాడ్ చేసిన శ్రీలీల.. నెటిజన్స్ నుంచి తీవ్ర విమర్శలు..

ఇలా టాప్ 10 సినిమాల్లో బాహుబలి 2, సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్, కల్కి సినిమాలతో ప్రభాస్ ఆల్మోస్ట్ ఆరు సినిమాలతో నిలిచాడు. ఇక 200 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగి పుష్ప 2 సినిమాతో అల్లు అర్జున్ టాప్ ప్లేస్ లో నిలిచాడు. ఎన్టీఆర్ దేవర సినిమా పదో స్థానంలో నిలిచింది. మరి ఫ్యూచర్ లో ఇంకెన్ని సినిమాలు ఈ రికార్డులని బద్దలు కొడతాయో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు